ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో స్వీయ గృహ నిర్భందంలో ఉంటున్న చిరంజీవి తాను ఈ కరోనా సమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో వివరిస్తూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. ఇప్పుడు తన ఇంటిలో ఒకవిధంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది అంటూ తన కూతుళ్ళు తన చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిసి తనతోపాటే ఉంటూ ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టాడు.


తన ఇంటిలో ఉండే కుక్స్ సహాయకులు ఎప్పటి నుండో తన ఇంటిలోనే ఉంటున్న పరిస్థితులలో వారంతా తనతో కలిసి ఉంటున్నారని అయితే తన కార్లకు సంబంధించిన డ్రైవర్స్ సెక్యూరిటీ పర్సన్స్ హౌస్ కీపింగ్ స్టాఫ్ ఇలా చాలామందికి సెలవు లు ఇచ్చిన విషయాన్ని తెలియచేసాడు. అంతేకాదు తాను తన చెల్లెళ్ళతో కలిసి నచ్చిన సినిమాలు చూస్తూ నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ రెండు పూట లా ఎక్స్ సైజ్ లు చేస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ తాను కరోనా సమయాన్ని ఒక ఫెస్టివల్ లా సెలెబ్రేట్ చేసుకుంటున్న సందర్భాన్ని వివరించాడు.


వాస్తవానికి తన జీవితం పై ఎంతోమంది రచయితలు ఎన్నో పుస్తకాలు వ్రాసినా తన ఆత్మకథ వ్రాసుకోవాలని తనకు ఏనాటి నుండో కోరిక ఉన్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఇప్పుడు కరోనా వల్ల సమయం చిక్కడంతో తన భార్య సురేఖ తో కలిసి తన జీవితంలో గతంలో జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుకు చేసుకుంటూ వాటిని వీడియో రూపంలో రికార్డ్ చేస్తూ భవిష్యత్ లో వాటి ఆధారంగా తాను తన స్వీయ చరిత్ర రాయబోతున్న విషయాన్ని లీక్ చేసాడు. 


ఇక తన నేతృత్వంలో ప్రారంభించిన సిసిసి ట్రస్ట్ గురించి వివరిస్తూ ప్రస్తుతం తమ ట్రస్ట్ తరఫున ఇండస్ట్రీ కార్మికులకు చిన్నచిన్న వేషాలు వేసుకునే ఎక్స్ట్ ట్రా ఆర్టిస్టులకు 2222 రూపాయల విలువగల నిత్యవసర వస్తువులతో పాటు శానిటైజర్లు కొన్ని మాస్క్ లు కలిపి ఒక కిట్టు గా ఇస్తున్నామని ఇది తన సోదర సమానులైన తోటి కళాకారులకు తాను కృతజ్ఞతతో అందించే చిరు కానుక అని అంటున్నారు. ఖాళీ సమయంలో వంట చేయడం హాబీగా ఉండే చిరంజీవి ప్రస్తుతం కిచెన్ లోకి వెళ్ళి రకరకాల వంటలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆహార పదార్ధాలు వెస్ట్ చేయద్దు అంటూ అతడి భార్య సురేఖ అతడి చెల్లెళ్ళు తనను కిచెన్ నుండి తరిమేస్తున్న విషయాన్ని బయటపెట్టాడు. దీనినిబట్టి చూస్తే కరోనా పొదుపు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఐఖ్యత నేర్పుతోంది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: