ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం వలన ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి మరింతగా వ్యాప్తి చెందకుండా మన దేశంతో పాటు పలు ఇతర దేశాలు సైతం తమ దేశాల ప్రజలను ఏ మాత్రం ఇళ్ల నుండి బయటకు రానీయకుండా కట్టడి చేసి పూర్తిగా కొద్ది రోజుల పాటు లాకౌట్ ప్రకటించాయి. ఇక ఈ లాకౌట్ సమయంలో ప్రజలు అందరూ కూడా తమ ప్రక్క ఇళ్ల వారితో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అలానే ఎప్పటికప్పుడు తమ చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడంతో పాటు దగ్గు, తుమ్ము వంటివి వచ్చినపుడు మోచేయి వరకు చేతిని గట్టిగా అడ్డుపెట్టుకోవడం, లేదా టిష్యు పేపర్ వినియోగించడం వంటివి చేయాలని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. 

 

ఇక ఈ లాకౌట్ వలన దాదాపుగా అన్ని రంగాలు కూడా చాలావరకు నష్టాలు చవిచూసే పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ పై దీనిప్రభావం బాగానే పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని భారీ సినిమాలకు ముందస్తుగా పెట్టుబడిని అప్పుగా తీసుకున్న ఫైనాన్షియర్లతో పాటు తమ తమ సినిమాల షూటింగ్స్ కోసం పలువురు నటులకు కేటాయించిన కాల్ షీట్స్ కూడా వ్యర్థం అయ్యే పరిస్థితి వచ్చిందని, ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి చూస్తే సినిమా ఇండస్ట్రీ కోలుకోవడానికి చాలా వరకు సమయం పట్టేలా ఉందని అంటున్నారు. 

 

దీనితో రోజువారీ సినిమా వర్కర్ల జీవితం అయితే పూర్తిగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, ఎవరికీ కూడా పనుల్లేకపోవడంతో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి కొందరు రోజువారీ కార్మికులు రావడంతో సినీ పెద్దలు దయతో కనికరించి అటువంటి వారికి పలువిధాలుగా సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఈ లాకౌట్ కనుక మరికొద్దిరోజుల కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని, అదే జరిగితే బడా సినిమాల నిర్మాతలతో పాటు చిన్న నిర్మాతలు కూడా కుదేలయి, అందరూ కోలుకోవడానికి రెండేళ్లకు పైగా పట్టినా పట్టవచ్చని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: