బిగిల్ తరువాత కోలీవుడ్  స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం మాస్టర్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ లోనే  విడుదలకావాల్సి వుంది అయితే కరోనా వల్ల థియేటర్లు మూతపడడంతో  విడుదల వాయిదా పడింది. దాంతో ఎలాగైనా మే లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన  మాస్టర్ ఆడియో, ఫస్ట్ లుక్ పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ రాగ తాజాగా టీజర్ ను విడుదలచేయడానికి సిద్ద మైంది చిత్ర బృందం. అందులో భాగంగా  టీజర్ కట్ కూడా జరిగిపోయిందని అతి త్వరలో విడుదలకానుందని సమాచారం. 
 
ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్, జాన్  దొరైరాజ్ గా ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటించగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో నిర్మిస్తున్న  ఈ చిత్రానికి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయింది. థియేట్రికల్,నాన్ థియేట్రికల్కలుపుకొని 200కోట్ల బిజినెస్ చేసింది. 
 
ఇక మాస్టర్ తెలుగు లో కూడా విడుదలకానుందని తెలిసిందే. ఈ హక్కులను మహేష్ ఎస్ కోనేరు దక్కించుకున్నాడు. ఇంతకుముందు విజిల్(బిగిల్) ను కూడా తెలుగులో కోనేరే విడుదలచేసి లాభాలను ఖాతాలో వేసుకున్నాడు. కాగా సర్కార్, విజిల్ తెలుగులో కూడా హిట్ కావడం తో  మాస్టర్ పై అక్కడ  కూడా మంచి అంచనాలు వున్నాయి. ఈచిత్రం తమిళ్ తోపాటు తెలుగులోనూ ఒకే సారి విడుదలకానుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: