చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ భారత్ లో కూడా రోజు రోజుకు విజృంభిస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వరుకు లాక్ డౌన్ విధించారు. అయితే మోదీ ఇదే సమయంలో జాతిలో ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కుల, మత, బేధం లేకుండా ప్రతి ఒక్కరు కరోనాపై పోరుకు స్పూర్తినిస్తూ ఏప్రిల్ 5వ తేదీన అంటే ఈరోజు రాత్రి లైట్లు అన్ని ఆపేసి దీపాలు వెలిగించాలని అయన పిలుపునిచ్చారు. 

 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రధాని దీపాలు వెలిగించే కార్యక్రమంపై చిరంజీవి కుటుంబం మద్దతు ఇచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ట్విట్టర్ ద్వారా ప్రధాని పిలుపుకు మద్దతు ప్రకటిస్తూ ట్విట్ చేశారు.. రామ్ చరణ్ ఇలా ట్విట్ చేశారు.. ''అందరికీ నమస్కారం.. ఈరోజు రాత్రి 9 గంటలకి మన ఇళ్లల్లో అన్ని లైట్స్ ఆర్పేసి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిద్దాం. ప్రధానమంత్రిగారి మాటను గౌరవిద్దాం.. కరోనా లేని భారతదేశాన్ని తప్పకుండా సాధిద్దాం'' అంటూ వీడియో మెసేజ్ ట్వీట్ చేశారు. 

 

 

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రధాని పిలుపుకు మద్దతు ఇస్తూ ఇలా ట్విట్ చేశారు.. ''మానవత్వాన్ని కాపాడటానికి మనమంతా ఒక్కటే అన్న యునైటెడ్ సందేశాన్ని దీపాలను వెలిగించడం ద్వారా ఇద్దాం.. కరోనా చీకట్లను తరిమేద్దాం.. మన ఐక్యమత్యాన్ని ప్రపంచ దేశాలకు చూపిద్దాం.. రండి ప్రధాని పిలుపుకు స్పందించండి.. కోరోనాను అంతమొందించండి. అందరూ ఒక్కటై వెలుగులు నింపండి'' అంటూ వీడియో మెసేజ్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: