పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ గా వస్తున్న పవన్ మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు పవన్. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్కని తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 

 

ఇక సినిమాలో ఐటం సాంగ్ కోసం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడకు ఛాన్స్ ఇస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు లేని పూజిత పొన్నాడ అందం అభినయం రెండు ఉన్నా అమ్మడికి లక్ కలిసి రావట్లేదు. రంగస్థలం సినిమాలో ఆది ప్రేమించిన అమ్మాయి పాత్రలో నటించిన పూజిత పొన్నాడ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్డేట్స్ చేస్తూ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది పూజిత పొన్నాడ. 

 

ఇప్పుడు పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. మరి పవన్ ఆఫర్ తో అయినా పూజితకి సూపర్ క్రేజ్ వస్తుందేమో చూడాలి. మెగా హీరోల సినిమాల్లో ఒకదానిలో ఛాన్స్ అందుకుంటే మాత్రం ఇక వాళ్ళకి వరుస అవకాశాలు వచ్చినట్టే లెక్క. పూజితకు మరి పవర్ స్టార్ ఆఫర్ ఈమేరకు  లక్ కలిసి వస్తోందో లేదో చూడాలి.

 

తెలుగు హీరోయిన్స్ స్కిన్ షో కి దూరం..  వాళ్ళు కమర్షియల్ సినిమాలు చేయరు అన్న సెంటిమెంట్ చెరిపేసేలా పూజిత ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనకుండా చేస్తుంది. పవన్  ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇక అమ్మడు మెగా ఫ్యాన్స్ దృష్టిలో పడినట్టే. అమ్మడికి ఇప్పటికైనా వరుస ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: