గత కొద్దిరోజులుగా ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ కూడా ఎంతో భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ మహమ్మారిని త్వరితగతిన అంతం చేయడానికి సామజిక దూరం ఒక్కటే ముఖ్య మార్గమని భావించిన పలు దేశాలు ఇప్పటికే తమ తమ దేశ ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించాయి. అలానే మన దేశాన్ని కూడా ఈ నెల 14వరకు పూర్తిగా లాకౌట్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

అయితే ఈ లాకౌట్ వలన కరోనా వ్యాప్తి చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చని, అలానే ప్రజలందరూ కూడా కేవలం అసరమైన సమయంలోనే బయటకు రావాలని, అది కూడా ఇంటికి ఒకరు మాత్రమే బయటకు వస్తే మంచిదని పలువురు అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ కరోనా ఎఫెక్ట్ తో పలు రంగాలతో పటు సినిమా పరిశ్రమ కూడా సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికీ సినిమా హాల్స్ తో పాటు షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడంతో రోజువారీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టుల వంటి వారికి జీవనోపాధి కరువై వారికి కనీసం తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. దానితో టాలీవుడ్ నుండి కొందరు ప్రముఖులు వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. 

 

అయితే రాబోయే మరికొద్దిరోజుల పాటు ఈ లాకౌట్ పొడిగింపబడే అవకాశం ఉందని సమాచారం అందుతోందని అంటున్నారు. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇక్కడ మెల్లగా తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం అనుకునే నూతన ఔత్సాహికులకు ఇది ప్రస్తుతం పూర్తిగా అడ్డుకట్టగా మారిందని, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా పలు సినిమాల పై ఈ కరోనా ప్రభావం విపరీతంగా ఉందని, ఇప్పటికే కొందరు నిర్మాతలు, తాము తెచ్చిన అప్పులపై వడ్డీ పెరుగుతోందని, అలానే పలువురు నటీనటుల కాల్ షీట్స్ కూడా రద్దు చేయవలసి వస్తోందని, తద్వారా తాము బాగా నష్టాలు చవిచూసే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: