బాలీవుడ్ బ్యూటీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ ఈ పేరు తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. గ‌తంలో నాగార్జునతో క‌లిసి ఒక చిత్రంలో కూడా న‌టించింది ఈ భామ‌. బాలీవుడ్ చిత్రం `ద‌స్త‌క్‌` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్‌. తొలి సినిమాతోనే ఆశించిన ఫ‌లితాన్ని ద‌క్కించుకోలేన‌ప్ప‌టికీ ఈ భామ హ‌వా కొన్ని రోజుల వ‌ర‌కు బాగానే న‌డిచింద‌ని చెప్పాలి. అయితే మొద‌ట్లో న‌ట‌న రాద‌ని విమర్శ‌లు కూడా వినిపించాయి. ఆ త‌రువాత సినిమాల్లో న‌టించే ప్ర‌య‌త్నం చేసినా కెరీర్‌ని ఎక్క‌డా సిరియ‌స్‌గా తీసుకున్న‌ట్టుగా అనిపించ‌లేదు. దాంతో సుస్మితకు న‌టిగా పెద్ద‌గా గుర్తింపు రాలేదు కానీ వివాదాస్ప‌ద నిర్ణయాల‌తో మాత్రం పాపుల‌ర్ అయిపోయింది.

 

వివాహం చేసుకోకుండానే  ఇద్ద‌రు అమ్మాయిల్ని ద‌త్త‌త తీసుకున్న సుస్మిత త‌న‌ కంటే చిన్నవాడైన బిజినెస్‌మేన్ రోమన్ షావ‌ల్‌తో చాలా కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తోంది. పెళ్లి వ‌ద్దు స‌హ‌జీవ‌నమే ముద్దు అంటుంది ఈ భామ‌.అంతే కాక ఆ ఇద్ద‌రు అమ్మాలు, త‌న ప్రియుడితో క‌లిసి ఒకే ఇంట్లో వుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇక చూసేవారికి ఇదో వెరైటీ రిలేష‌న్‌లా అనిపిస్తుంది. ఇక ఇది ప‌క్క‌న పెడితే... క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించ‌డంతో అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే.

 

ప్రియుడు ఇంట్లోనే వుండ‌టంతో అత‌నితో క‌లిసి హాట్ యోగా చేస్తూ ఆ ఫొటోల్ని, వీడియోని త‌న అభిమానుల కోసం సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి. ఇదిలా వుంటే తాజాగా మ‌రో హాట్ ఫొటోని సుస్మిత షేర్ చేసింది. అయితే గ‌తంతో పోలిస్తే ఈ సారి అందాల‌ని ఆర‌బోస్తూ రెడ్ డ్రెస్‌లో ఫొటోకు పోజులిచ్చింది. అంటే కాస్త డోస్ పెంచింద‌న‌మాట‌. ఈ ఫొటో కూడా వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజ‌న్స్ క్వారెంటైన్‌లో ఇలా కూడా వుంటారా? అని అవాక్క‌వుతున్నారు. మ‌రి కొంత మందైతే క్వారంటైన్‌లో ఉన్నావా..ఫ్యాష‌న్ షో చేస్తున్నావా అంటూ చిలిపిగా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: