థియేటర్స్ మూతపడినా.. అల వైకుంఠపురములో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. అల వైకుంఠపురములో మీద కరోనా ప్రభావం ఏమాత్రం కనిపించడంలేదు. ప్రపంచమంతా కరోనాతో ఒణికిపోతుంటే.. అల వైకుంఠపురములో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

 

ఈ మధ్యకాలంలో మ్యాజిక్ హిట్ అంటే.. ఎవరైనా సరే అల వైకుంఠపురములో పేరు చెప్పాల్సిందే. తమన్ అందించిన మ్యూజిక్.. సినిమాకు హైప్ కు ప్రధాన కారణంగా నిలిచింది. సినిమా రిలీజ్ కు నాలుగు నెలల ముందే వచ్చిన సామజవరగమన సాంగ్ ట్రెడ్ క్రియేట్ చేసింది. ఈ లిరికల్ సాంగ్ తక్కవ టైమ్ లో ఎక్కువ వ్యూవ్స్.. లైక్స్ తో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిచింది. 

 

సామజవరగమన సినిమాకు హైక్ తీసుకురాగా.. దీని తర్వాత వచ్చిన రాములో రాము.. బుట్ట బొమ్మ పాటలు కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. సినిమా రిలీజ్ తర్వాత సినిమాలోని వీడియో సాంగ్స్ అన్నింటినీ రిలీజ్ చేయగా.. కోట్ల వ్యూవ్స్.. లక్షల లైక్స్ తో యూ ట్యూబ్ లో సందడి చేశాయి. 

 

లిరికల్ సాంగ్ సామజవరగమన ట్రెండ్ క్రియేట్ చేయగా.. వీడియో సాంగ్స్ రిలీజ్ తర్వాత బుట్టబొమ్మ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాటను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయగా.. 100 మిలియన్ వ్యూవ్స్ దాటింది. ఈ 10కోట్ల వ్యూవ్స్ తో పాటు.. 10లక్షల లైక్స్ తో ఈ ఆల్బమ్ లో టాప్ ప్లేస్ లో ఉంది. 

 

అల వైకుంఠపురమలో వీడియో ఆల్బమ్ లో బుట్టబొమ్మ తర్వాత రాములో రాముల సాంగ్ 5కోట్ల వ్యూవ్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇంకొన్ని రోజుల్లో.. బుట్టబొమ్మతో పాటు.. సామజవరగమన.. రాములో రాముల కూడా 10కోట్ల వ్యూవ్స్ కు చేరువవుతాయని అంచనా. మొత్తానికి అల వైకుంఠపురములో సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: