ఇప్పుడు ఎక్కడ విన్న ఒకే మాట కరోనా.. అంటువ్యాధిలా వ్యాపిస్తున్న ఈ కరోనా ప్రభావం రోజు రోజు పెరుగుతూ వస్తుంది. ఈ మహమ్మారిని నివారించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకొస్తున్న కూడా ఉపద్రువంలా ముంచుకొస్తుంది. ప్రపంచ దేశాలను గడ గడ లాడిస్తూ వస్తున్నా ఈ కరోనా ప్రభావం భారత దేశం పై పంజా విసురుతుంది. 

 

 

 

దేశవ్యాప్తంగా ఇప్పటికే 250 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే లాక్ డౌన్ ని విధించిన ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యి తమని తాము ఎలా కాపాడుకోవాలి అని సూచిస్తుంది. ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఇందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 

ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా  కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా  వారికి సపోర్ట్ చేస్తున్నారు. 

 

 

 

సినీ ప్రముఖులు చాలా మంది విరాళాలను అందిస్తూ వస్తున్నారు. యంగ్ రెబల్ ప్రభాస్ మాత్రం 4 కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయినా ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉండటం పై ఆయన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం రెస్పొండ్ అవ్వకపోవడం గమనార్హం అని అందరు కొనియాడుతున్నారు. పేదలను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకు రావాలని అందరు కోరుతున్నారు. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: