కరోనా క్రైసిస్ లో స్టార్ హీరోయిన్స్ పై వచ్చిన విమర్శలను నయనతార తిప్పికొట్టింది. హీరోలు.. నటులు.. టెక్నీషియన్స్ ముందుకొచ్చి.. విరాళం ప్రకటించగా.. స్టార్ హీరోయిన్స్ స్పందించకపోవడంపై.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నయనతార 20లక్షల విరాళం ప్రకటించి.. కరోనాపై విరాళమిచ్చిన తొలి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. 

 

కరోనా క్రైసిస్ లో స్టార్ హీరోయిన్స్ స్పందించకపోవడంతో.. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. 20 నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకునే స్టార్స్ కోటి నుంచి 4కోట్ల వరకు విరాళం ప్రకటించగా... కోటి నుంచి నాలుగు కోట్లు తీసుకుంటున్న హీరోయిన్స్ తమ వంతు సాయం చేస్తే బాగుంటుందని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు. 

 

తెలుగులో స్టార్ హీరోయిన్స్ కు కొదవలేదు. కరోనాపై ఫైట్ చేస్తున్న ప్రభుత్వాలకు అండగా ఒక్కరంటే ఒక్కరు కూడా నిలవలేదు. నాగచైతన్య 20 లక్షలు ప్రకటించడంతో.. సమంత సెపరేట్ గా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. పూజా హెగ్డే.. రష్మిక.. త్రిష లాంటి స్టార్ స్పందించలేదు. స్టార్ మిన్నుకున్నా.. ఒకటీ అర సినిమాలతో ఉన్న లావణ్య త్రిపాఠి స్పందించి సినీ కార్మికుల నిత్యావసరాల కోసం.. లక్ష డొనేట్ చేసింది. 

 

కరోనా కష్టసమయాల్లో హీరోలు మాత్రమే ముందుకు రావడం హీరోయిన్లు రాకపోవడం చర్చనీయాంశమైంది. కొద్దోగొప్పో స్టార్ డమ్ లేని హీరోయిన్స్ విరాళం ప్రకటించడం విశేషం. ప్రణీత ముందడుగు వేసి 50కుటుంబాలకు అండగా నిలబడింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విరాళం ఇవ్వకపోయినా.. తన ఇంటి దగ్గర్లో ఉన్న రెండు వందల కుటుంబాలకు రోజూ రెండు పూటల అన్నం పెడుతోంది. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వారికి ఆహారాన్ని అందిస్తామంటోంది రకుల్.

 

ఫిలిమ్ ఎంప్లాయి్స్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు 2లక్షలు విరాళం ఇచ్చిన నయనతారను చూసైనా మిగతా హీరోయిన్లు సాయం చేసేందుకు ముందుకొస్తారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: