యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో రామ్ చరణ్ కూడా అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2021 జనవరి 8న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. 

 

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టిన ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. త్రివిక్రమ్, తారక్ కాంబినేషన్ లో ఆల్రెడీ అరవింద సమేత సినిమా వచ్చింది. త్రివిక్రమ్ మార్క్ దాటి తీసిన ఈ సినిమా హిట్ అయ్యింది. ఇక మళ్ళీ ఈ కాంబోలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఒకటి వస్తుందట. ఈ సినిమాకు అయినాను పోయి రావలె హస్తినకు టైటిల్ పరిశీలనలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో తారక్ లోని కామెడీ యాంగిల్ ను వాడేస్తాడట త్రివిక్రం. 

 

త్రివిక్రమ్ మాటల పదును ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే తన పంచులు కూడా బాగా పేలుతాయి. ఎన్టీఆర్ లోని కామెడీ యాంగిల్ ను ఫుల్లుగా వాడేద్దామని ఫిక్స్ అయ్యాడు త్రివిక్రం. అదుర్స్ తర్వాత తారక్ చేయబోయే ఈ సినిమా కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్ చేస్తుందని అంటున్నారు. సినిమా కోసం త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ మొదట్లోనే అల వైకుంఠపురములో తో సూపర్ సక్సెస్ అందుకోగా తారక్ తో మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్. ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీమ్ లుక్ తో దుమ్ముదులిపేసి.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో కామెడీ రోల్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు తారక్. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: