కరోనా వైరస్ దెబ్బకి పత్రికా రంగం కూడా కుదేలు అయిపోయింది. లేనిపోని వదంతులతో పేపర్ పై కూడా వైరస్ ఉంటుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో జనాలంతా పేపర్ కొనడమే మానేశారు. పైగా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రావటంతో అంతకుముందే పత్రికా రంగం పూర్తిగా డేంజర్ జోన్ లో పడింది. క్షణాల్లో వార్తలు లైవ్ లో వచ్చేయడంతో పాటు సోషల్ మీడియా ఉండటంతో ఎప్పటికప్పుడు ప్రజలు ప్రపంచానికి అప్ డేట్ అవుతూనే ఉన్నారు. ఒకానొక సమయంలో ప్రభుత్వంలో గానీ ప్రపంచంలో గానీ ఏదైనా వార్త జరిగితే అది పేపర్లో పడిన రోజు మాత్రమే తెలిసేది. ఆ సంఘటన లేకపోతే ఆ విషయం జరిగి మూడు రోజులైనా అయ్యాక బయట ప్రపంచం లోకి వచ్చేది. అటువంటిది టెక్నాలజీ రావడం 3g, 4g రావడంతో జర్నలిజం లో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

 

ఇటువంటి నేపథ్యంలో తెలుగు పత్రికా రంగంలో మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఈనాడు అధినేత రామోజీరావు...ప్రస్తుతం పత్రికా రంగంలో వస్తున్న పరిస్థితుల బట్టి సరికొత్త ఆలోచన చేస్తున్నారు. రోజురోజుకీ పత్రికా విలువలు పడిపోవడంతో పాటుగా ఈనాడు మార్కెట్ రేటు కూడా పడిపోతున్న నేపథ్యంలో, ఉన్న కొద్దీ పత్రికల్లో చాలా పేజీలు కుదించు కుంటూ రామోజీరావు నెట్టుకొస్తున్నారు. ఒకానొక సమయంలో సినిమారంగానికి, మరియు క్రీడా రంగానికి అదేవిధంగా చదువుకు సంబంధించి ఈనాడు పత్రికలో ఒకో పేజీ కేటాయిస్తే..., తాజాగా వాటన్నిటినీ ఒకే పేజీలో కుదించుకుంటూ రాణిస్తున్నారు.

 

అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈనాడు పత్రికలను డౌన్లోడ్ చేసి వాట్సాప్ లో గ్రూప్ లో పోస్ట్ చేయడంతో...చాలావరకు దెబ్బతింది.  ఇటువంటి పరిస్థితుల్లో చాలావరకు నెట్టుకు వస్తున్న రామోజీరావు ఈనాడు లో సరికొత్త పంథా తరహాలో….రేపు ఏం జరగబోతోంది అనే టెన్షన్ లో పరిస్థితి ఉంది. ఇటువంటి టైం లో ఈనాడు పత్రికను మొత్తం ఔట్సోర్సింగ్ ఇవ్వటానికి రెడీ అవుతున్నట్లు తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పత్రికా రంగంలో అసలు రేపు ఏం జరగబోతుంది అని అనుకున్న టైంలో రామోజీరావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: