దేశంలో ఇప్పుడు కరోనా ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. వాణిజ్య, ఆర్థిక వ్యవస్థలకు ప్రశ్నార్థకంగా మారింది.  మనుషుల మద్య దూరాన్ని పెంచింది.  ప్రపంచంలో జనాలు కరోనా తో పిట్టల్లా రాలిపోతున్నారు.  కరోనా వైరస్ వల్ల ఇప్పుడు దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కొందరు లాక్‌డౌన్‌ని పాటించకుండా బయట తిరుగుతున్నారని, ఇది చాలా ప్రమాదం అని అన్నారు నటి రేణు దేశాయ్.  నాకు తెలుసు. మనం అందరం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో.

 

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కానీ తప్పదు.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఎంతో బోర్ ఫీల్ అవుతున్న ఇంట్లోనే  ఉండండి. నేను నా బాల్కనీ నుంచి చూస్తున్నాను. చాలా మంది బయట తిరుగుతున్నారు. బస్‌లు కనిపిస్తున్నాయి. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి.  ఇలా అయితే కరోనాని ఎలా కట్టడి చేస్తామని అంటున్నారు.  దేశంలో కరోనా వ్యాప్తి జరగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.  లాక్‌డౌన్ మన రక్షణ కోసం, మన కుటుంబ రక్షణ కోసం.. మన పిల్లల కోసం. దయచేసి ఇంట్లోనే కూర్చోండి. బయటికి వెళ్లవద్దు.

 

ఒక్కసారి అనుకుంటే ఏదైనా చేయగలం. ఇంట్లో మనకు ఇబ్బందులు ఉన్నా కరోనాని జయించాలన్న లక్ష్యం అందరికీ ఉండాలని అన్నారు. ఒకవేళ బయటికి వెళితే.. ఎవరికి కరోనా వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలియదు. ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తికి మీరు దగ్గరవడం వల్ల మీకు కూడా ఆ వైరస్ అంటుకుంటుంది. కొన్ని రోజులు ఓపిక పడితే కరోనాని నిర్మూలించగలుగుతాం.. చక్కగా ఆరోగ్యంగా ఉండండి అన్నారు. దేశంలో లాక్ డౌన్ ఉల్లంఘన వల్ల కేసులు మరిన్ని పెరిగిపోతున్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: