మెగాస్టార్ ఫ్యామిలీలో మెగా బ్రదర్స్ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు అన్నదమ్ములను చూస్తే ఏ కుటుంబం లో ఉన్న ముగ్గురు అన్నదమ్ములైనా వీళ్ళని అన్నీ విషయాలలో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిందే. కొన్ని కోట్ల మందికి మెగా సోదరులు ఆదర్శం గా నిలిచారంటే అందులో అతిశయోక్తి లేదని చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి రాజకీయాలను పక్కనపెట్టి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ తో చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి హిట్ ని దక్కించుకుంది.

 

ఇక ప్రస్తుతం మెగాస్టార్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో 152వ సినిమాగా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా మీద ఇప్పటికే ఇండస్ట్రీ తో పాటు మెగా ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం రీసెంట్ గా లీకైన మెగాస్టార్ లుక్ అని చెప్పాలి. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి అయింది. అయితే కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతానికి లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.  

 

ఇక మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాని తెలుగు రీమేక్ హక్కులను రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘లూసిఫర్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించారు. ఆ పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నారు. ఈ సినిమా తప్ప ప్రస్తుతానికి మెగాస్టార్ అఫీషియల్ గా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.  అయితే నెక్స్ట్ సినిమా కోసం పూరి జగన్నాధ్, వినాయక్, నాగ్ అశ్విన్ వంటి దర్శకులతో చర్చలు జరుగుతున్నాయట. అంతేకాదు ప్రస్తుతం అనుకుంటున్న ‘లూసిఫర్’ రీమేక్ కు  దర్శకుడు ఎవరనేది ఇంకా అనుకోలేదని చిరంజీవి క్లారిటి ఇచ్చారు. 

 

ఇక పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో సాగే ఈ సినిమాలో నటించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతానికి ఆ సినిమా నేనే చేస్తాను. ఒకవేళ తమ్ముడు చేయాలని నిజంగా అనుకుంటే మాత్రం తప్పకుండా తనకు ఇచ్చేస్తానని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఈ అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉందో తెలియడానికి ఇదే నిదర్శనం అని తెలియడానికి ఇంకేం కావాలి. 
     

మరింత సమాచారం తెలుసుకోండి: