ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సినీ ప్రముఖులు పలువురు ఇప్పటికే తమ సందేశాల ద్వారా తెలిపారు. తాజాగా, సినీ నటి మీనా స్పందించింది. ఈ మహమ్మారి కట్టడి కోసం, మన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఇంకా రోడ్లపై తిరుగుతుండటం బాధగా ఉందని పేర్కొంది.

 

 


ప్రజల సంరక్షణ లో భాగంగా లాక్ డౌన్ ను విధించింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. 

 

 


ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా  కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా  వారికి సపోర్ట్ చేస్తున్నారు.ఈ మేరకు  ఏప్రిల్ 5 న విద్యుత్ దీపాలతో కరొనను పారద్రోలాలని మోడీ పిలునిచ్చారు. 

 

 

 


ఈ మేరకు సినీ  నటి  మీనా మాట్లాడుతూ.. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు ఎలాంటి  ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయో తెలుసా? అని ప్రశ్నించిన మీనా, ఆయా దేశాల్లో ఒక రోజులోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అదే, అమెరికా దేశంలో అయితే రెండున్నర లక్షల మందికి పైగా ఈ వైరస్ తో ఇబ్బందిపడుతున్నారని, ఇలాంటి పరిస్థితి మనకు రావొద్దని అన్నారు. ‘ఇంట్లోనే కూర్చుని ప్రపంచాన్ని కాపాడే అవకాశం అందరికీ దొరకదు’ అని చెప్పిన మీనా, మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుంది’ అని సూచించింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: