కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణువర్ధన్ బాబు మొదటగా బలనటుడిగా ఒకటి, రెండు సినిమాల్లో నటించడం జరిగింది. ఆ తరువాత పెరిగి పెద్దదయ్యాక విష్ణు సినిమాతో ఆయన హీరోగా పరిచయం అయ్యాడు. ఆపై మెల్లగా వస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్న విష్ణు, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ తో పాటు మరికొన్ని విజయాలు కూడా అందుకున్నాడు. ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడి, వంటి హిట్ సినిమాల్లో నటించిన విష్ణు, కొన్నాళ్లుగా మాత్రం సరైన సక్సెస్ ని సాదించలేకపోతున్నారు. ఓవైపు హీరోగా నటిస్తూ మరోవైపు నిర్మాతగా, అలానే తన తండ్రి మోహన్ బాబు బిజినెస్ సంస్థలను కూడా చూసుకుంటూ ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా ఎంతో భారీ ఖర్చుతో ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో నిర్మితం ఆవుతున్న మోసగాళ్ళు సినిమాలో మరొక నటుడు సునీల్ శెట్టితో కలిసి ఆయన ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 

 

పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు నటిస్తున్న ఈ సినిమాని ఎంతో భారీగా కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా నిర్మిస్తున్నాం అని ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో విష్ణు చెప్పడం జరిగింది. అయితే మధ్యలో తన కెరీర్ లో తనకు ఫ్లాప్స్ ఎదురుకావడానికి కారణం, అక్కడక్కడా రెండు మూడు సినిమాలు తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పకపోవడం అని విష్ణు అన్నారు .ఇక తాను ఇటీవల నటించిన ఆచారి అమెరికా యాత్ర తో పాటు కొన్నాళ్ల క్రితం దాసరి నారాయణరావు స్వయంగా నటిస్తూ దర్శకత్వం తనతో అలిసి నటించిన ఎర్ర బస్సు  సినిమాలు ఆ విధంగా చేసినవే అని విష్ణు షాకింగ్ గా చెప్పారు. ఆచారి అమెరికా యాత్ర సినిమా విషయమై ఎడిటింగ్ లో కొన్ని లోపల వలన అది సరిగా ఆడలేదని, ఇక ఎర్ర బస్సు సినిమా విషయానికి వస్తే, అది దాసరి గారికి మేము చూపవలసిన కృతజ్ఞతగా చేసానని అన్నారు. 

 

వాస్తవానికి ఆ సినిమా అఫర్ తనకు వచ్చినపుడు కొందరు తనని ఆ సినిమాలో నటించవద్దని హెచ్చరించారని, అలానే ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ కూడా దాసరి గారి వంటి గొప్ప వ్యక్తి మా నాన్న గారి ఎదుగుదలకు ఎంతగా కారకులు కావడంతో, ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా అనే విషయం  ప్రక్కన పెట్టి, అంత గొప్ప దిగ్గజ దర్శకుడి సినిమాలో నేను కూడా భాగస్వామిని కావడం కోసం నటించానని, నిజంగా అది ఒకరకంగా తన అదృష్టం అని విష్ణు అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: