టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు అర్జున్, మొదటగా మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక చిన్న డ్యాన్సింగ్ బిట్ లో నటించడం జరిగింది. ఆ తరువాత కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్, మొన్నటి అలవైకుంఠపురములో సినిమా వరకు కూడా కెరీర్ పరంగా ఒక్కక్కొమెట్టు ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు.
ముందుగా ఆయన కెరీర్ రెండవ సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా అప్పట్లో మంచి హిట్ కొట్టి, హీరోగా బన్నీ కి ఫస్ట్ బ్రేక్ ని అందించడం జరిగింది. ఆపై వచ్చిన పరుగు, దేశముదురు, జులాయి, రేస్ గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలవైకుంఠపురములో సినిమాలు బన్నీ కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచి హీరోగా ఆయనకు మంచి క్రేజ్ ని అలానే ఫ్యాన్ ఫాలోయింగ్ ని తీసుకురావడం జరిగింది. మొదటి నుండి కూడా తాను చేస్తున్న ప్రతి ఒక్క సినిమాకి తన నటన, స్టైలింగ్ విషయంలో ఎంతో కొంత వైవిద్యం చూపిస్తూ వస్తున్న బన్నీ కి ఆ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని పేరు వచ్చింది. ఇక అప్పట్లో ఆయన మూడవ సినిమాగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ మూవీ టైటిల్ వాస్తవానికి ఆయన ముద్దు పేరు కావడం విశేషం.
Thank you so much ROCKSTAR @ThisIsDSP for accepting our request and releasing our beloved stylish star @alluarjun birthday CDP 😍♥
— Trends allu arjun ® (@TrendsAlluArjun) April 5, 2020
Eagerly waiting for #AA20 💥💥#AlluArjunBirthdayCDP 👌👌#AlluArjunBirthdayTrendOnApril7th https://t.co/tPY0b8KRCE
ఇకపోతే ఇటీవల రెండేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న బన్నీకి, మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా మంచి సక్సెస్ ని అందించి కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని ఇచ్చింది. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీలో నటిస్తున్న బన్నీ మరొక రెండు రోజుల్లో తన 36వ జన్మదినాన్ని జరుపుకోనున్నాడు. అయితే ఆయన పుట్టిన రోజు సిడిపి, కామన్ డిస్ప్లే పిక్చర్ ని నిన్న రాత్రి, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి బన్నీకి ముందస్తుగా బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఆ సిడిపి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!