మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు. ఈ సినిమాలోని చరణ్ ఫస్ట్ లుక్ టీజర్‌ను పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు తారక్ వాయిస్ ఓవర్ తో రిలీజైన ఈ టీజర్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో రాజమౌళి చెప్పకనే చెప్పారు. 

 

ఇక చరణ్ తన నెక్ట్స్ సినిమాని ఏ డైరెక్టర్ తో చేస్తాడో ఇంకా క్లారిటి లేదు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో మాత్రం ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారట. కాని చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయ్యాకే ఆచార్యలో జాయిన్ అవ్వాలని జక్కన్న పట్టుపట్టారట. ఇది ఇప్పుడు తెగని సమస్యలా మారిందని అంటున్నారు.

 

అయితే కొరటాల శివ మాత్రం చరణ్‌ను ఎలాగైనా ఆచార్య సినిమాలో నటించమని అందుకు డేట్స్ సర్ధుబాటు చేయమని రిక్వెస్ట్ చేస్తు బలవంత పెడుతున్నారట. ఈ విషయంలో ఇప్పుడు చరణ్ ఇరకాటంలో పడ్డాడట. అయితే చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల తర్జన భర్జన పడుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని అడుగుతున్నారట.

 

అయితే ప్రస్తుతం డేట్స్ మిస్ అయితే మళ్ళీ తారక్ తో కాంబినేషన్ సీన్స్ కి అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయని డైలమాలో పడ్డారట. అయితే చరణ్ ఇటు రాజమౌళి కి అటు కొరటాల కి ఏం చెప్పాలో అర్థంకాక ఇరకాటం లో పడ్డట్టు ఫీలవుతున్నాడట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: