మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల నటన పరంగా సూపర్ అనిపించుకుంటున్నా ఎందుకో ఆమె సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. తీసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందాయి. సూర్యకాంతం సినిమా తర్వాత సినిమాలు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన నిహారిక సైరా సినిమాలో చిన్న పాత్రలో మెప్పించింది. ఇక ఆ తర్వాత ఏ సినిమాకు కమిట్ అవలేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూస్తే నిహారిక మళ్ళీ పెదనాన్న చిరంజీవి సినిమాలో నటిస్తుందని అంటున్నారు.

 

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో నిహారిక కూడా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఆల్రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నాడని తెలిసిందే. ఇప్పుడు మెగా డాటర్ కూడా సినిమాలో భాగం అవుతుందని తెలుస్తుంది. హీరోయిన్ గా సినిమాలు తీస్తున్నా సక్సెస్ ఆడుకొని నిహారికకు మెగాస్టార్ మరో లక్కీ ఛాన్స్ ఇస్తున్నాడు. సినిమాలో నిహారిక పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. 

 

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో చరణ్, చిరు ఇద్దరు నక్సలైట్స్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఈ ఇయర్ దసరాకి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నా లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడటంతో సినిమా అనుకున్న టైం కు రిలీజ్ అవడం కూడా కష్టమనిపిస్తుంది. ఆచార్య మెగా ఫ్యాన్స్ అందరు ఖుషి అయ్యేలా చిరు డ్యాన్స్, ఫైట్స్ అన్ని సమపాళ్లలో ఉంటాయని తెలుస్తుంది. సినిమా తప్పకుండా సంచలనాలు సృష్టించేలా ఉంది. ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు సైరాతో సంచలనం సృష్టించాడు. ఆచార్యతో మళ్ళీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: