కరోనా ప్రభావంతో పేద ప్రజల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. కేవలం రోజు కూలీ మీద బతికే పేద కుటుంబాలకు పూట గడవని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన పెద్ద మనసు చాటుకుంది. గురుగ్రామ్‌ లోని తన ఇంటికి దగ్గరలో ఉండే 200 పేద కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. తనకు ఈ స్థాయి ఇచ్చిన సమాజానికి ఇది తను చేసే చిన్న సాయం అని చెప్పింది రకుల్‌.

 

తన తల్లి దండ్రులతో కలిసి తన ఇంటి దగ్గరలోని బస్తీలో ఉంటున్న 200 కుటుంబాలకు స్వయంగా ఇంట్లోనే భోజనాల వండి పంపిస్తోంది. `మా నాన్న స్లమ్‌లో కనీస అవసరాలు కూడా తీరని పేదలను గుర్తించాడు. వారందరికీ రోజుకు రెండు పూటలా భోజనం అందిస్తున్నాం. ఈ లాక్‌ డైన్‌ కొనసాగినంత కాలం ఇలా పంపించాలని నిర్ణయించుకున్నాం. ఒక వేళ లాక్‌ డౌన్‌ మరింత కాలం పొడిగిస్తే మేం కూడా మా సాయాన్ని పొడిగిస్తాం. ప్రస్తుతానికి ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాం. ఆ తరువాత పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం.` అంటూ చెప్పుకొచ్చింది.

 

`మనందరం ఒక విషయాన్ని గమనించాలి. మనం చాలా సుఖంగా ఉంటున్నాం. మనకు ఇళ్లు, సాయం, ఆహారం తో పాటు ఎమర్జెన్సీలో స్టాక్‌ చేసుకునే స్థోమత కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం సమజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం. మనం సాయం చేసిన వారు తింటున్నప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందానికి మించినది ఏం లేదు` అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది రకుల్.

 

ఇక సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామకు ఇటీవల ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తమిళ, హిందీ సినిమాలకు మాత్రమే పరిమతమైన ఈ బ్యూటీ మూడు హిందీ, రెండు తమిళ  సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: