కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. మనిషి ఎంత ఎదిగినా ఒక చిన్న వైరస్ ముందు తలదించక తప్పట్లేదు. దాదాపు ప్రపంచమంతా లాక్ డౌన్ ని పాటిస్తూ ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. బయటకి వేళ్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. కరోనా వైరస్ అప్పటి వరకు మనం చేసుకున్న ప్లాన్ లన్నింటినీ చెదరగొట్టేసింది.

 

ఎన్నో పరిశ్రమలు కరోనా కారణంగా దెబ్బతిన్నాయి. చిల్లర వ్యాపారాల నుండి మొదలు పెడితే పెద్ద పెద్ద సంస్థలు సైతం కరోనా ధాటికి కుదేలైపోతున్నాయి. కరోనా వల్ల సినిమా రంగం మీద కూడా భారీగా ప్రభావం పడింది. రిలీజ్ కావాల్సిన చిత్రాలన్నీ థియేటర్లు తెరుచుకోక ల్యాబ్ లోనే ఉండిపోతున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తికాని చిత్రాలు మళ్ళీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాయో తెలియదు.

 

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ సంవత్సరం విడుదల అయ్యే పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఒక్కటే అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ప్రభాస్ నటిస్తున్న ఓ డియర్ చిత్రం ఇంకా షూటింగ్ జరుపుకోవాలి. నత్తనడకన సాగుతున్న ఈ షూటింగ్ పూర్తి కావాలంటే చాలా టైమ్ పడుతుంది. పూర్తి విదేశాల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. అన్నీ కుదురుకుని చిత్రీకరణ అయిపోవాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది. కాబట్టి ఈ ఏడాది విడుదల అయ్యే ఛాన్సే లేదు.

 

 

దసరాని టార్గెట్ చేసుకుని వస్తున్న మెగాస్టార్ ఆచార్య కూడా ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసింది. అయితే చిరంజీవి ఫాస్ట్ గా తెరకెక్కించాలని నిబంధన పెట్టిన కారణంగా ఈ ఏడాది చివరి వరకు పూర్తి కావొచ్చు. అన్ని పనులు ముగించుకుని విడుదల అయ్యేసరికి వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది. కాబట్టి షూటింగ్ చాలా వరకు పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ లోనూ ఎక్కువ సమయం తీసుకోని వకీల్ సాబ్ చిత్రం తొందరలో విడుదలకి సిద్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: