మెగాతమ్ముడు నాగబాబు కూతుతు నీహారిక బుల్లితెర ద్వారా పరిచయమై ఆ తర్వాత మెల్లగా వెండితెర మీదకి షిఫ్ట్ అయింది. బుల్లితెర మీద హోస్ట్ గా చేసి సక్సెస అయిన నీహారిక వెండితెర మీద విజయం అందుకోలేదు. మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ సూపర్ సక్సెస్ అయి దూసుకెళ్తుంటే ఆ ఫ్యామిలీలో నుండి వచ్చిన మెగా డాటర్ కి ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా లేదు.

 

 

మొదటగా షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన నీహారిక హీరోయిన్ గా నాగశౌర్యతో ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆమెకు విజయాన్ని ఇవ్వలేదు. అంతకుముందు ముద్దపప్పు ఆవకాయ,నాన్న కూచి, మ్యాడ్ హౌస్ వంటి చిత్రాల్లో వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ సిరీస్ లు ఆమెని గుర్తుపెట్టుకునేలా చేశాయే కానీ వెండితెర మీద అవకాశాలని మాత్రం తెచ్చిపెట్టలేదు.

 

 

గత కొన్ని రోజుల నుండి ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంది. హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు మతిని పోగొడుతోంది. మెగా డాటర్ ఇలా ఫోటో షూట్లు చేయడంతో మెగా అభిమానులు ఇబ్బంది పడుతున్నా, హీరోయిన్ గా ఎదగాలంటే ఆ మాత్రం చేయాల్సిందే అని ఆమెకి తెలుసు కాబట్టి వాటిని పట్టించుకోవట్లేదు. అయితే నీహారిక మెగా సినిమాలో అవకాశం వచ్చిందట.

 

 

మెగాస్టార్ నీహారికకి తన సినిమాలో అవకాశం ఇస్తున్నాడట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాలో ఒక  ముఖ్యపాత్ర కోసం నీహారికని తీసుకోనున్నారట. గతంలో ఆమె సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్రకి పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు మరో అవకాశాన్ని ఇస్తున్నాడు చిరంజీవి. మరి ఈ అవకాశం నీహారికకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: