విజయ్ దేవరకొండ విజయ్‌పై అనన్యపాండే మనసు పారేసుకుంది.. విజయ్ ఎంత గొప్పవాడో తెలుసా అంటూ తెలిసిన వారందరికీ అడక్కుండానే చెప్పేస్తోదంంట. ఇటీవల ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ విజయ్ గురించి తెగపొగిడేయడం గమనార్హం. విజయ్‌లాంటి వ్యక్తిని నేను చూడలేదు...అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ దక్షిణాది చిత్రసీమపై దృష్టి పెట్టింది.
పూరి సినిమాలో లక్కీగా ఛాన్స్ కొట్టేసింది. అందులోనూ అర్జున్‌రెడ్డితో ఇండియా అంతటా ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ దక్కేసరికి ఇప్పుడు ఈభామ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందంట. పూరి, విజయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 40 రోజుల షూటింగ్ ముంబయిలో జరిగింది. సెట్లో తీసిన విజయ్, అనన్య ఉన్న స్టిల్స్ వైరల్ అయ్యాయి. విజయ్‌తో కలసి నటించిన సమయాన్ని తాను ఎన్నటికి మరిచిపోలేనని చెబుతోంది. ఇందులో విజయ్‌తో కలిసి నటించడం గురించి అనన్య ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘విజయ్ పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా వినయంగా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనది.
అంతేకాదు చాలా దయ ఉన్న వ్యక్తి. సున్నితంగా మాట్లాడుతారు’ అంటూ పొగడ్తలతో విజయ్ను ఆకాశానికెత్తేసిందంట. అనంతరం సినిమా గురించి ముచ్చటిస్తూ.. ‘ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇది నాకు, విజయ్‌కు కొత్త అనుభూతి. దక్షిణాదికి నేను కొత్త కావడంతో విజయ్ చాలా విషయాలు చెబుతున్నారు. ఇక విజయ్ నటిస్తున్న తొలి హిందీ సినిమా కావడంతో ఇతర రాష్ట్ర ప్రజల్ని మెప్పించగలమా? అనే కంగారు మా ఇద్దరిలోనూ ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో విజయ్‌కు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. భారీ రిలీజ్‌కు నిర్మాతలు ప్రయత్నాలు ఇప్పటి నుంచి సాగిస్తుండటం గమనార్హం.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple