మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే ఆఫర్ల విషయంలో మెగా హీరోయిన్ నిహారిక ఇబ్బంది పడుతూనే ఉంది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్నా ఆమెకు మాత్రం ఆఫర్లు రావడం లేదు. ఆమెకు అవకాశం ఇవ్వడానికి ఏ దర్శకుడు ముందుకి రావడం లేదు. అయితే చిరంజీవికి ఆమె సినిమాలు చేయడం ఇష్టం లేదని కొందరు ప్రచారం చేసారు. కాని ఆమె మాత్రం వరుసగా చిరంజీవి సినిమాల్లోనే నటిస్తుంది. 

 

చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమాలో ఆమె ఇలా కనిపించి అలా వెళ్లిపోయింది. గిరిజన యువతీ పాత్రలో నిహారిక కనిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఆమె మళ్ళీ చిరంజీవి సినిమాలోనే నటిస్తున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ, చిరంజీవి సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఆమె అడవిలో ఉంటే గిరిజన యువతిగానే ఆమె నటిస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. 

 

చిరంజీవి కారణంగానే ఆమెకు ఆ అవకాశం వచ్చింది అని టాక్. చిరూ అవకాశం ఇవ్వాలని కొరటాల కు చెప్పడం తోనే కొరటాల ఈ సినిమాలో తీసుకున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆమె వరుస ఆఫర్లతో ఇప్పుడు బిజీ అవ్వాలని చూసినా స్కిన్ షో చెయ్యాలి అనుకున్నా సరే ఆమెకు అవకాశాలు పెద్దగా రాకపోవడం తోనే చిరంజీవి ఈ ఆఫర్ ఇచ్చారని టాలీవుడ్ జనాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: