కరోనా దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం కుదేలైపోయింది. ‘ప్రస్తుతం సినిమా గురించి జనాలు ఆలోచించే పరిస్థితి లేదు’ అని సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి అన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులు ఎప్పటికి కుదుటపడి షూటింగ్ లు రెగ్యులర్ గా జరుగుతాయో చెప్పలేని పరిస్థితి. కరోనా కల్లోలానికి 2020లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో చెప్పలేని పరిస్థితి. మే నుంచి రెగ్యులర్ షూట్ చేసినా దసరా తర్వాతే ఏమైనా క్రేజీ సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

 

 

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ ఏడాది విడుదలయ్యే స్టార్ హీరోల సినిమాలు తక్కవని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, వెంకటేశ్ నారప్ప, నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలే రిలీజ్ అయ్యేట్టున్నాయి. దాదాపు డబ్బై శాతం షూటింగ్ పూర్తైన ఆచార్య, దాదాపు షూటింగ్ పూర్తైన వకీల్ సాబ్ దసరా పండగ లోపే వచ్చే అవకాశం ఉంది. ఇదే టైమ్ లో కాస్త అటుఇటుగా వెంకటేశ్, నాగార్జున సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

 

 

బాలకృష్ణ సినిమా ఈ ఏడాది వస్తుందన్న క్లారిటీ లేదు.  మహేశ్ సినిమా ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు ఇంకా షూటింగ్ తొలి దశల్లోనే ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ వచ్చ ఏడది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ ఏడాది విడుదలయ్యే స్టార్ హీరోల సినిమాలు తక్కువే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: