జూనియర్ ఎన్టీఆర్... యంగ్ టైగర్, టాలీవుడ్ కా బాద్షా... ఇలా అనేకరకాలుగా ముందుగా పిలుపించుకొనే నందమూరి వారసుడు నందమూరి తారక రామారావు. ఆయన సినిమా వస్తుంది అంటే సినీ అభిమానులకి చాలా ఆసక్తి ఉంటుంది. ముక్యంగా ఆ సినిమాకి దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు, నిర్మాత ఎవరు అనే వాటి మీద ఎంతో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే కథ ఏ విధంగా ఉంటుంది అనేది దానిమీద కూడా అభిమానులు వారి స్టైల్ లో ఏదోక వార్త వెతుకుతూ ఉంటారు. ఇక Jr. ntr సినిమా కోసమని పనులు మానుకుని కూడా అభిమానులు ఆయన దెగ్గరికి కలవడానికి వెళ్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దగ్గర ఇప్పుడు #RRR అనే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. 

 


 
కాకపోతే ఈ సినిమా మాత్రం వచ్చే సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకోగా కీలక సన్నివేశాల షూటింగ్స్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా కూడా కరోనా పరిస్థిత్తులు సద్దు మనిగిన తర్వాత త్వరలో షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.

 

 


అయితే కరోనా కారణంగా ఇంట్లోనే ఉన్న త్రివిక్రమ్ ప్రతీ సీన్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. అయితే ఇందులో ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ కాగా మరో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గానూ "అయిననూ పోయి రావలె హస్తినకు" అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: