దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అంతకు ముందే కరోనా వ్యాప్తి చెందుతుందని మాల్స్, థియేటర్లు అన్నీ మూసి వేశారు.  అయితే కరోనా తగ్గే వరకు షూటింగ్స్, సినిమాల రిలీజ్ అన్నీ వాయిదా వేశారు.  లాక్ డౌన్ తో సినీ పరిశ్రమలు అన్నీ షెట్ డౌన్ అయ్యాయి.  దాంతో సినీ కార్మికులను ఆదుకునేందుకు సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ తమ మంచి మనసు చాటుకున్నాడు.  వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు నడుం బిగించారు.

 

తన వంతుగా లక్ష కుటుంబాలకు సాయం చేస్తానని ప్రకటించారు. తాజాగా ఆయన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్షమంది దినసరి సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందిస్తామని చెప్పారు.   ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు తమ వంతు సహాయంగా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  సల్మాన్ ఖాన్ 25 వేల మంది కార్మికుల ఖాతాల్లో నేరు గా డబ్బు వేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 

అమితాబ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్ నెట్ వర్క్, కల్యాణ్ జ్యువెల్లర్స్ మద్దతు ఇవ్వనున్నాయి. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్‌ వర్క్ ధ్రువీకరించింది. దేశ వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫిల్మ్, టెలివిజన్ కార్మికుల కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించింది.  సోనీ పిక్చర్స్ తరఫున కనీసం యాభై వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఒక నెల సరుకులు ఇస్తామని ఆ సంస్థ సీఈవో ఎన్పీ సింగ్ తెలిపారు.  పేద ప్రజలకు ఈ సమయంలో ఎంత సహాయం చేస్తే అంత మంచిదని అంటున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: