టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు రాజీవ్ కనకాల తర్వాత నటుడిగా తన సత్తా చాటుతూ వచ్చారు.  ప్రముఖ నటుడు, దర్శకులు  దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాల.  మొదటి నుంచి సినీ రంగానికి దగ్గరగా ఉంటూ వచ్చిన రాజీవ్ కనకాల టెలివిజన్ రంగంలో పలు సీరియల్స్ లో నటించాడు.  ఆయన సతీమణి ప్రముఖ యాంకర్ సుమా కనకాల. తాజాగా రాజీవ్ కనకాల ఇంట విషాదం చోటు చేసుకుంది.  సీనియర్ నటుడు, నటనా రంగానికి ఎనలేని సేవ అందించిన దేవదాస్ కనకాల-లక్ష్మి దేవి కనకాలల కుమార్తె, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల అక్క ఈరోజు మృతి చెందారు.  

 

శ్రీలక్ష్మి కనకాల తెలుగు టెలివిజన్ నటి. దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే సిరియల్ ద్వారా నటనలోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మి. చదువులో చురుగ్గా ఉండే శ్రీలక్ష్మి పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకుంది. విద్యోదయ హైస్కూల్ లో తన పాఠశాల విద్యను చదివిన శ్రీలక్ష్మి, మద్రాస్ విశ్వవిద్యాలయంలోలో ఎం.ఏ. పూర్తిచేసింది. ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

 

ఆమెకు గతంలో క్యాన్సర్ ఎటాక్ కాగా ఆమె మనోస్థైర్యంతో పోరాడి దానిలో నుండి బయట పడ్డారు. అయితే ఆమె అనుకోకుండా మరణించడంతో కనకాల వారింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు గతంలో ఏపీ మంత్రిగా పనిచేసిన లోకేష్ కి తెలుగు ట్యూటర్ గా కూడా ఉన్నారు. ఇక వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం అని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: