అక్కినేని సమంత... ఈ పేరు గురించి పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం దక్షిణాది సినిమా పరిశ్రమలలో ఏమి నటించిన సినిమాలు అంత విజయాన్ని అందుకున్నాయి కాబట్టి. కాబట్టి ఈ పేరు గురించి మరీ ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే అక్కినేని వారసుడు నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అక్కినేని ఇంటి కోడలైన ఈమె ప్రస్తుతం ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. 

 

 


ఒకదిక్కు వైవాహిక జీవితాన్ని మరోదిక్కు సినీ జీవితాన్ని సమంత బ్యాలెన్స్ చేసే విధానం చూసి మిగతా ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారంట. అయితే తాజాగా ఈ సొగసరి భామ ఒక ఇంగ్లీష్ పత్రిక నిర్వహించిన పోల్‌ లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ - 2019 టైటిల్‌ ను అందుకుంది. కాకపోతే ఈ అవార్డులపై కొందరు విమర్శలు చేసినా.. నిజంగానే సమంత మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అనే చెప్పచు. 

 

 


ఈ సంవత్సరం మొదట్లో దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘జాను’ తో పలకరించింది సమంత. నిజానికి జాను సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.., కమర్షియల్‌ గా మాత్రం ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు. మరీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా తర్వాత మరో సినిమాని తమిళంలో యాక్ట్ చేయడానికి ఓకే చేసింది. దానితో పాటు ఒక రియాలిటీ షో చేయబోతున్నట్టు కూడా సమాచారం అందుతోంది.

 

 

 
తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ - 2 త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సిరీస్‌ కు సంబంధించిన విడుదల తేదీని అతి త్వరలో అనౌన్స్ చేయనున్నరన్న విషయం తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతం సినిమాలతో ప్రేక్షకులను అలరించిలేకపోయినా, సమంత మాత్రం ఇప్పుడు ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌ లో విలన్ గా కనిపించే పాత్రలో అభిమానులను కనువిందు చేస్తుందని వెబ్ సిరీస్‌ సభ్యులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: