ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ఏ రకంగా ఇబ్బందులు పెడుతుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన  ఈ మాయదారి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అంతా చుట్టేస్తుంది. ప్రపంచ వ్యాప్తం రోగుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే కరోనాపై జనాలకు అవగాహన తీసుకు రావడానికి సెలబ్రెటీలు ఎన్నో రకాలుగా తమ వంతు కృషి చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి క‌రోనాపై  సరికొత్త పేరడీ సాంగ్ తో మన ముందుకు వచ్చారు.  ఇటీవల  ‘స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌' చిత్రంలోని ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి’ అనే పాటని పేరడీగా రూపొందించిన సంగ‌తి తెలిసిందే.

 

‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి. ఎక్కడివాళ్లు అక్కడే ఉండి ఉక్కు సంకల్పంతో తరుముదాం దాన్ని బయటకి. వీ విల్‌ స్టే ఎట్‌ హోమ్‌. వీ స్టే సేఫ్‌' అంటూ పాట రూపంలో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు.  తాజాగా నిన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు నిన్న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించిన విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో  భార‌తీయుల ఐక్య‌త‌ని చాటిన విధానం పై సాంగ్ రూపొందించారు కీర‌వాణి.  ఈగ చిత్రం లోని అరె..అరె.. అరె పాట‌ని పేర‌డీగా మార్చి.. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9గం.ల‌కి అద్భుత సంఘ‌ట‌నే జ‌రిగింద‌ని పాట‌గా రూపొందించారు. ఈ పాటని కాళభైర‌వ పాడారు.  తాజాగా ఈ వీడియో సాంగ్ వైరల్ అవుతుంది. 

 

రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: