బుట్టబొమ్మ డేటింగ్ చేస్తోందా. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే నిజంగానే లవ్ లో పడిందా.. ఓ హ్యాండ్ సమ్ గాయ్ తో పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అందాల బుట్టబొమ్మను  లవ్ లోకి దించిన అందగాడెవరో తెలుసా.

 

ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. వరుస సక్సెస్ లతో ఈ బ్యూటీ కెరీర్ యమ జోరుమీదుంది. ఇప్పుడు టీటౌన్ లో స్టార్ హీరోలకు ఈ బ్యూటీ ఏకైక ఆప్షన్ గా కనిపిస్తోంది. కమర్షియల్ సినిమాలకు కావాల్సిన గ్లామర్ క్వాలిటీస్ పూజాలో పర్ ఫెక్ట్ గా ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూకడుతున్నారు. ఇలా కెరీర్ పీక్స్  ఉన్న టైమ్ లో పూజా హెగ్డే లవ్ లో పడిందనే వార్త ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

 

పూజా హెగ్డే ఓ స్టార్ హీరో కొడుకుతో ప్రేమాయణం నటిపిస్తుందని బీటౌన్ లో గుసగుసలు సాగుతున్నాయి. బాలీవుడ్ యాక్టర్ వినోద్ మెహ్రా వారసుడు రోహన్ మెహ్రాతో టీటౌన్ బుట్టబొమ్మ అఫైర్ నడుపుతున్నట్టు జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను జత చేస్తూ వీరిద్దరి మధ్య ప్రెండ్ షిప్ మించి ఏదో ఉందనే బాలీవుడ్ కోడై కూస్తోంది. ప్రస్తుతం రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే కారులో వెళ్తున్న ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

అసలే బాలీవుడ్ లో ఇలా కనిపిస్తే అలా ఎఫైర్ అంటగడతారు. ఈ వార్తలపై పూజా హెగ్డే కానీ రోహాన్ మెహ్రా కానీ పెదవి విప్పడం లేదు. మరి ఈ వార్తలపై పూజా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలోనూ కనిపించనుంది. అటు బాలీవుడ్ లో సైతం పూజాకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: