టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డేతో సినిమా చెయ్యాలని ఎందరో హీరోలు ఎదురు చూస్తున్నారు. మరో హీరోయిన్ లేకపోవడం కూడా ఆమెకు బాగా కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. నటన రాకపోయినా సరే ఆమె మాత్రం అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతుంది. ఇక దర్శకులు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 

 

అక్కడ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు గానూ ప్రయత్నాలు చేస్తుంది. ఆఫర్లు కూడా రావడం తో రేటు కూడా భారీగానే పెంచింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం ఆమె పేరుని త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా ఆమెను సినిమా చెయ్యాలని అడిగినట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఆమెను వేరే సినిమాలను కూడా పక్కన పెట్టాలని చెప్పినట్టు తెలుస్తుంది. 

 

పూజ కూడా ఇందుకు ఓకే చెప్పింది. వీరి ముగ్గురి కాంబినేషన్ లో అరవింద సమేత అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. టాలీవుడ్ లో కొన్ని రికార్డ్స్ ని ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం పూజ బరువు పెరుగుతుంది అని కూడా అంటున్నారు. ఇక ఆమెకు భారీగా ఆఫర్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల మాట. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: