కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో చాలా మంది జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు వారికి సాయం చేసేందుకు వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నా ఆకలికేకలు మాత్రం ఆగడం లేదు. ఇక సినిమా, టీవీ ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి ఉంది. షూటింగ్‌‌లు బంద్ కావడంతో పాటు.. థియేటర్స్ మూత పడటంతో వేల మంది సినీ కార్మికులు, కళాకారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఇదిలా వుంటే ఆక‌తాయిలు, సైకోలు మాత్రం ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని వాడుకుంటూ ఫేక్ వార్త‌ల్ని వంటి వారుస్తూ ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో భాయాందోళ‌న‌లు పెరిగిపోతున్నాయి.

 

కేర‌ళ‌లో ఏకంగా మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇది కేర‌ళ‌లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. మోహ‌న్‌లాల్‌కు క‌రోనా సోకింద‌ని, ఆ కార‌ణంగానే ఆయ‌న చ‌నిపోయార‌ని ఓ ఫేక్ వీడియోని సృష్టించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. దీంతో మోహ‌న్‌లాల్ ఫొటోల‌తో రూపొందించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న కేర‌ళ పోలీసులు న‌కిలీ వార్త‌ల్ని ప్ర‌చారం చేస్తే క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేర‌ళ ముఖ్య మంత్రి పిన‌ర‌యి విజ‌య్ కూడా న‌కిలీ వార్త‌ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీచేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఏమైనా ఇలాంటి ఆకతాయిల పై పోలీసులు కఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. కేర‌ళ ముఖ్య మంత్రి పిన‌ర‌యి విజ‌య్ కూడా న‌కిలీ వార్త‌ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీచేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇక ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఇప్పటికే చాల మంది ప్రాణాలను కోల్పోయారు. ఇంకా లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా కరోనా మహమ్మారి నుండి ప్రపంచం బయట పడాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: