శ్రీరెడ్డి ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరూ. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది ఈ భామ. `మా`లో శివాజీరాజా తనకు సభ్యత్వం ఇవ్వలేదంటూ నానా హంగామా చేసి అర్థనగ్న ప్రదర్శనతో దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అక్కడి నుంచి అదే పంథాను అనుకరిస్తూ వరస వివాదాస్పద పోస్ట్ లతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. లైవ్‌లోనూ బూతుల్ని సాధారణంగా మాట్లాడటం మొదలుపెట్టిన శ్రీరెడ్డి ఇటీవల కరోనా వైరస్‌కు శృంగారమే మందు అంటూ మరో సంచలనం వ్యాఖ్యలు చేసి అల్లకల్లోలం సృష్టించింది.
తాజాగా అక్కినేని కోడలు సమంతని, హీరోయిన్ త్రిషని కూడా కెలికింది. తెలుగు, తమిళ భాషల్లో ఏ ఒక్కరినీ వదలని శ్రీరెడ్డి తాజాగా ఈ ఇద్దరిపై సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా చెప్పడానికి వీలు లేని వ్యాఖ్యలు చేయడం పలువురిని ఆగ్రహానికి గురి చేస్తోంది. పెద్దా చిన్నా ఇలా ఏమీ ఆలోచించదు శ్రీరెడ్డి తనకు ఏది తోస్తే అది మాట్లాడేస్తుంది. ఏకంగా అక్కినేని కోడలు సమంత, త్రిష అస్సెట్స్పైనే కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నారు. విమర్శలకు హద్దు అదుపూ అంటూ ఏమీ లేదా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తన అస్సెట్స్తో పోలిస్తే వారిలో ఒకరి అస్సెట్స్ లెమన్స్ అయితే మరొకరి అస్సెట్స్ గ్రేప్స్ అని, వారు తన ముందు నిలబడలేరని దారుణంగా ఫేస్ బుక్ పేజీలో ఘాటుగా శ్రీరెడ్డి కామెంట్ చేయడం ఆమె దిగజారుడు తనానికి నిదర్శనంగా నిలుస్తోందని అంతా కామెంట్ చేస్తున్నారు. మరీ ఇంతలా దిగజారడం అవసరమా అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సామ్, త్రిషల గురించి అసభ్యంగా పోస్ట్ చేసింది శ్రీరెడ్డి తన అస్సెట్స్తో పోలిస్తే వారివి ఎంత అంటూ బూతు అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. తప్పు తప్పుగా మాట్లాడింది. బూతు అర్థం ధ్వనించేలా డబుల్ మీనింగులతో ప్రేలాపనలు పేలింది. మరి దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోబోతోంది?. త్రిష ఎలా రియాక్ట్ కాబోంది? అన్నది వేచి చూడాల్సిందే. అయితే త్రిష సంగతి ఎలా ఉన్నా అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్న కోడలి గురించి అలా కామెంట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రియాక్షన్ ఉంటుందేమో చూడాలి మరి.