మాస్ మహారాజ రవితేజ ఇటీవల సైన్స్ ఫిక్షన్ సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించిన డిస్కో రాజా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా తెరకెక్కిన ఆ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటించడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ లో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అయిన ఆ సినిమా ద్వారా నిర్మాతకు భారీ నష్టం వచ్చినట్లు ఇటీవల టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేసాయి. 

 

అయితే ఇదే నిర్మాత అయిన రామ్ తాళ్లూరి, గతంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన నెల టిక్కెట్టు సినిమాని కూడా నిర్మించడం జరిగింది. అప్పటికే సోగ్గాడే చిన్ని నాయన, రారండోయి వేడుక చూద్దాం వంటి మంచి సక్సెస్ఫుల్ సినిమాలు దర్శకుడు కళ్యణ్ తీసి ఉండడంతో నేల టిక్కెట్టు కూడా మంచి హిట్ కొడుతుందని హీరో రవితేజ, నిర్మాత రామ్ ఇద్దరూ కూడా నమ్మి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే వారి అంచనాలు పూర్తిగా తలక్రిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఆ సినిమా నిర్మాతకు నష్టాలు తెచ్చిపెట్టింది. ఇకపోతే ముచ్చటగా మూడవసారి రామ్ తాళ్లూరి నిర్మాతగా రవితేజతో మరొక సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. ఇటీవల తమిళ్ లో మంచి హిట్ కొట్టిన మల్టీస్టారర్, విక్రమ్ వేద మూవీని తెలుగులో రవితేజ, పవన్ కళ్యణ్ ల కలయికలో నిర్మించాలని రామ్ భావిస్తున్నారని అంటున్నారు. 

 

తమిళ్ లో మంచి హిట్ కొట్టిన ఆ సినిమా తప్పకుండా తెలుగులో కూడా మంచి సక్సెస్ అవుతుందని, అలానే రవితేజ తో పాటు పవన్ కూడా ఈ సినిమాలో నటిస్తే మార్కెట్ పరంగా కూడా మంచి స్కోప్ ఉంటుందని ఆయన భావిస్తున్నారట. స్వతహాగా పవన్ కు మంచి సన్నిహితుడైన రామ్ ఈ విధమైన ఆలోచన చేయడం బాగుందని, అయితే రేపు సినిమా నిర్మించి రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా, ముచ్చటగా రవితేజతో తీసిన మూడు సినిమాలతో ఆయన పూర్తిగా నెత్తిన చెంగు వేసుకోవడం ఖాయం అని, అయితే ఈ సినిమాని మంచి దర్శకుడికి అప్పగించి ఆ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేస్తే ఆడే ఛాన్స్ ఉందని పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: