గత కొద్దిరోజులుగా ప్రపంచ దేశాలు అన్నిటినీ కూడా విపరీతంగా వణికిస్తోన్న మహమ్మారి కరోనా వలన ఇప్పటికే లక్షల్లో ప్రజలు అస్వస్థతకు గురవడంతో పాటు మరికొందరు మృత్యువాత పడ్డారు. అయితే ఈ మరణాలను ఇకనైనా ఆపాలంటే ఎక్కడి ప్రజలను అక్కడే తమ తమ ఇళ్లకు పూర్తిగా పరిమితం చేసేలా భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు లాకౌట్ ని అనుసరిస్తున్నాయి. అయితే ఈ లాకౌట్ వలన ముఖ్యంగా ప్రజల మధ్యన సోషల్ డిస్టెంసింగ్ పెరిగి, కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుందని భావించి 21 రోజులపాటు దీనిని ప్రకటించడం జరిగిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. 

 

అయితే ఇన్నిరోజులు పాటు లాకౌట్ కొనసాగడం వలన ముఖ్యంగా దిగువ, పేద తరగతుల ప్రజలు మరింతగా కష్టాల్లో కూరుకుపోయి పనులు లేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. అయితే అటువంటి అట్టడుగు వర్గాల వారిని ఆదుకోవడానికి కేంద్రం తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఆర్ధిక సాయాన్ని, అలానే ఫ్రీ రేషన్ సరుకుల వంటి వాటిని ప్రకటించడమా జరిగింది. అయితే ఇటువంటి కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడం తమ విధి అని పలువురు ధనికులు, ప్రముఖులు తమ దయాగుణంతో ఎంతో కొంత సాయం అందించాడని ముందుకు వస్తున్నారు. 

 

ఇకపోతే మిగతా రంగాల తో పాటు సినిమా రంగం నుండి ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు తమకు వీలైనంత సాయాన్ని అందించగా, నేడు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, తనవంతుగా ఏకంగా లక్ష మంది సినిమా కార్మికులకు నెలరోజులకు ఒక సాధారణ కుటుంబానికి సరిపోయే ఉచిత సరుకులను అందించడానికి సహృదయంతో ముందుకు రావడం జరిగింది. అయితే ఆయనకు దీనికి గాను దాదాపుగా పది నుండి పదిహేను కోట్లకు పైగా ఖర్చు అవుతుందని భావించిన ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ సోని పిక్చర్స్ వారు, అమితాబ్ తో కలిసి తమవంతుగా సాయం అందించడానికి ముందుకు రావడం జరిగింది. ఇక బిగ్ బి చేస్తున్న ఈ గొప్ప పనికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: