ప్రస్తుతం టెక్నాలజీ ట్రెండ్ ఎంతగా మారింది అంటే ప్రతి ఒక్కరి చేతికి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటివి ఎంతో ఈజీగా వచ్చేస్తున్నాయి. ఒకప్పటితో పోలితే ఫోన్ల ధరలు సామాన్యులకు సైతం ఎంతో తక్కువ ధరల్లో లభిస్తుండడం, వాటితో పాటు ఇంటర్నెట్ డేటా ధరలు కూడా తగ్గడంతో ప్రతి పదిమందిలో ఆరుగురు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఇక వీటి రాకతో ప్రతి ఒక్కరికీ ప్రపంచం చేతిలోకి వచినట్లయిందనే చెప్పాలి. ఇక ప్రతి ఒక్క ఫోన్ లోను ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు ఉండడంతో ఎవరికి వారు తమకు నచ్చిన ఫోటోలను ఎక్కడపడితే అక్కడ దిగి తమ సోషల్ మీడియా అకౌంట్స్ వాటిలో పోస్ట్ చేసేస్తున్నారు. 

 

అలానే ఫోన్ లో గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి కూడా లభిస్తుండడంతో సెలెబ్రిటీల దగ్గరి నుండి సామాన్యులు వరకు అందరూ తమకు సంబందించిన సమాచారాన్ని వాటిలో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తున్నారు. ఇక ఒకప్పటితో పోలిస్తే ఇటీవల కాలంలో మనలో దాదాపుగా చాలామంది యూట్యూబ్ మీద పడ్డారు. చేతిలో ఒక సెల్ ఫోన్, బుర్రలో కొద్దిపాటి టాలెంట్ ఉంటే చాలు తమకు తోచిన విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాటిలో రకరకాల వీడియోలు షూట్ చేసి పోస్ట్ చేయడం, వాటి ద్వారా బాగా వ్యూస్, లైక్స్ లభించినట్లైతే తద్వారా యూట్యూబ్ నుండి ఆదాయం కూడా బాగానే పొందుతున్నారు. 

 

ఇక ఈ విధంగా ఇటీవల పలువురు సెలెబ్రిటీలు సైతం యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి ఓవైపు పేరుతో పాటు మరోవైపు చక్కగా ఆదాయాన్ని ఆర్జించడం పరిపాటి అయిపోయింది. ఇకపోతే నేడు బన్నీతో కలిసి నటించిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ, నేడు సొంతంగా తన పేరుమీద యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. మీ అందరి ఆదరణ నాకు కావాలి, తప్పకుండా నా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి అంటూ ఆమె తన అభిమానులను కోరడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: