అల వైకుంఠపురములో సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. బన్ని లేకుండా సినిమా సెట్స్ మీదకు వెళ్లగా లాక్ డౌన్ ఎత్తేస్తే సినిమా రెగ్యులర్ షూట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సినిమా కోసం బన్ని గెడ్డం పెంచేశాడు. సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ రేపు అనగా ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. 

 

దానికి సంబందించిన ఒక ఎనౌన్స్ మెంట్ అఫీషియల్  గా చేశారు. మైత్రి మూవీ బ్యానర్ లో సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ క్రేజీ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా ముందు రిలీజ్ చేసిన పోస్టర్ ఏంటంటే.. ఏమబ్బా అందరు బాగుండారా.. మీరు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తాండే.. #AA20 అప్డేట్ ఏప్రిల్ 8 తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా.. అంటూ వదిలారు. 

 

సినిమాలో హీరో మాట్లాడే రాయలసీమ యాసతో ఈ పోస్టర్ వదిలారు అంటే సినిమాలో బన్ని పాత్ర గురించి వచ్చిన వార్తల్ని నిజమే అని చెప్పొచ్చు. శేషాచలం, వేట ఈ రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా మరో రంగస్థలం అని చెప్పడానికి ఈ డైలాగ్ పోస్టర్.. ఇక రాబోయే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా కారణాలు అని చెప్పొచ్చు. రామ్ చరణ్ కు రంగస్థలంతో ఎలాంటి హిట్ ఇచ్చాడో దాన్ని మించేలా బన్ని సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

 

సుక్కు, బన్ని కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృస్తిస్తుందో చూడాలి. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: