బాహుబలి తర్వాత రాజమోళి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్. ఈమధ్యనే టైటిల్ పోస్టర్ తో పాటుగా అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు డబుల్ చేసింది. రాజమౌళి సినిమా అంటేనే ఒక బ్రాను అలాంటిది ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో చేస్తున్న సినిమా అంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. ట్రిపుల్ ఆర్ అంచనాలను మించి ఉంటుందని అందరు అనుకుంటున్నారు. సినిమాలో ఇద్దరు రియల్ హేరిస్ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.

 

ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్. ఈ పాత్ర రాసుకున్నప్పుడు అందుకు ఎవరైతే బాగుంటారా అన్న ఆలోచనలో పడ్డాడట జక్కన్న. స్టార్ ఇమేజ్ ఉండి. అతను చెప్పే మాటలు నిజాయితీగా నమ్మేలా చేసే నటుడు కావాలని అనుకున్నారట. అలంటి పాత్ర ఎవరు చేస్తే బాగుంటారని పదిమందిని అడిగితె తొమ్మిది మంది అజయ్ దేవగన్ పేరు రిఫర్ చేశారట. తనకు ఆయనే పర్ఫెక్ట్ అనిపించడంతో ఆర్.ఆర్.ఆర్ లో ఆయన్ను తీసుకున్నామని అంటున్నారు రాజమౌళి. 

 

పాత్రకు ఒప్పుకోవడమే కాదు ఇచ్చిన పాత్రను ఏంటో అంకితభావంతో పనిచేశారని.. ఈ పాత్రను అజయ్ దేవగన్ ఒప్పుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటున్నారు రాజమౌళి. జక్కన్న రివీల్ చెయ్యట్లేదు కానీ అజయ్ పాత్ర వల్లే సినిమా టర్న్ అవుతుందట. అందుకే ఆయన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం సినిమా 2021 జనవరి 8న రిలీజ్ ప్లాన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: