స్టార్ హీరోల మీద నిర్మాతలు ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా దాదాపు సినిమాల షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన పరిస్థితి. ఇప్పట్లో ఏ సినిమా కూడా షూటింగ్ కి వెళ్ళే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. దీనితో పెట్టుబడి పెట్టిన నిర్మాతల్లో ఇప్పుడు కంగారు మొదలయింది. అసలు ఈ ఏడాది సినిమాలు ఉంటాయా లేదా అనే ఆందోళన వాళ్ళల్లో వ్యక్తమవుతుంది. 

 

స్టార్ హీరోల తో సినిమాలు చేయడానికి గానూ భారీగా పెట్టుబడులు పెట్టారు కొందరు నిర్మాతలు. ఇక ఇప్పుడు తమతో సినిమా చెయ్యాలని వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది స్టార్ హీరోలకు నిర్మాతలు ఎక్కువగా అడ్వాన్స్ లు ఇచ్చేసారు. వాళ్ళ డేట్స్ కూడా త్వరగానే తీసుకున్నారు. కాని ఇప్పుడు కరోనా కారణంగా సినిమాలు షూటింగ్ చేయలేని పరిస్థితి దాదాపుగా నెలకొంది. 

 

దీనితో స్టార్ హీరోల తో ఇప్పుడు రాయబారాలు నడుపుతున్నారు. తమతో సినిమాలు చెయ్యాలని వారిని కోరుతున్నారు. ఇక కొంత మంది హీరోల మీద అయితే తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు నిర్మాతలు. తాము భారీగా నష్టపోయే ప్రమాదంలో ఉన్నామని సినిమా చేయకపోతే తమకు ఆత్మహత్య మినహా మరో మార్గం లేదని నిర్మాతలు హీరోలకు చెప్పే పరిస్థితి లో ఉన్నారు. స్టార్ హీరోలు కూడా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఎవరి తో సినిమాలు చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఎవరితో చేస్తారో ఎవరిని నష్టాల నుంచి బయటకు తీసుకుని వస్తారో...

మరింత సమాచారం తెలుసుకోండి: