సినిమాల్లో ఒక్క అవకాశం వస్తే చాలు అనుకుని ఉంటారు హీరోయిన్లు. తమ తో సినిమా చేయడానికి ఎవరైనా ముందుకి రాకపోతారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కొందరు హీరోయిన్ లు. నిర్మాతలు కూడా ఎవరిని తీసుకోవాలి అనేది దర్శకులతో చర్చలు జరిపి ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి తీసుకునే పరిస్థితి ఉంటుంది. హీరోయిన్లు ఇప్పుడు కరోనా కారణంగా చాలా ఖాళీ గా ఉంటున్నారు అనేది వాస్తవం. 

 

కొంత మంది హీరోయిన్లు అవకాశం వస్తే చాలు అనుకుని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కరోనా కారణంగా నిర్మాతలు నష్టాల్లో ఉన్నారు కాబట్టి ఎంత తక్కువ కు సినిమా చేస్తే తమను అంత బాగా నిర్మాతలు గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తున్న చాలా మంది హీరోయిన్లు తక్కువ ధరకు సినిమాలు చెయ్యాలని చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే తాము డిమాండ్ చేయవద్దు అనే భావనలో ఉన్నారు. 

 

సినిమా ఎలా ఉన్నా సరే ఇప్పుడు నిర్మాతలకు అండగా నిలిస్తే వాళ్ళు మనను భవిష్యత్తులో గుర్తు పెట్టుకునే అవకాశం ఉందని హీరోయిన్ లు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ధర తక్కువ అయినా పర్వాలేదు మేము సినిమా చేస్తామని హీరోయిన్ లు ఇప్పుడు రాయబారాలు నడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ లు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు కూడా. మరి ఎవరికి అవకాశాలు వరిస్తాయో...

మరింత సమాచారం తెలుసుకోండి: