టాలీవుడ్ లో స్టార్ హీరోతో సినిమా చెయ్యాలి అనుకున్నా... చిన్న హీరోతో సినిమా చెయ్యాలి అనుకున్నా సరే ఇప్పుడు చాలా వరకు కనపడుతుంది రష్మిక మందానా, అలాగే పూజ హెగ్డే. వీళ్ళు మినహా ఇప్పుడు దర్శకులకు నిర్మాతలకు, హీరోలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. గత ఆరు నెలల కాలంలో విడుదల అయిన సినిమాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. వాళ్ళు అడిగిన మొత్తం ఇచ్చి మరీ వాళ్ళతో సినిమాలు చేస్తున్నారు. 

 

పూజ హెగ్డే బాలీవుడ్ హీరోయిన్... అయినా సరే ఆమె తెలుగులో ఎక్కువగా నిలబడింది. అవకాశాల కోసం ఎదురు చూసి ఇక్కడ స్టార్ హీరోయిన్ అయింది. రష్మిక మందన చిన్న హీరోయిన్ అయినా సరే ఆమె అవకాశాల కోసం ఎదురు చూసింది. ఎక్కువగా సినిమాల్లో ఛాన్స్ లు కోసం ఎక్కువగా కష్టపడింది. ప్రస్తుతం ఆమె వరుసగా విజయాలు దక్కించుకుని కెరీర్ లో పీక్ స్టేజి లో ఉంది. ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు  కూడా ఎక్కువ. 

 

అయితే ఇప్పుడు వీళ్ళకు ప్రత్యామ్నాయం చూసే పనిలో పడ్డారు నిర్మాత లు. వాళ్ళ తో కాకుండా కొత్త హీరోయిన్స్ కి అవకాశం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ పక్కన పెట్టి కొత్త వారిని తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా కష్టపడుతున్నారు వారు కూడా ధరలు పెంచి సినిమాలు పెద్ద హీరోలతోనే చెయ్యాలని చూస్తున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళను పక్కన పెట్టాలని కొందరు నిర్మాతలు ఎక్కువగా భావిస్తున్నారు. ఇక వాళ్ళ సేవలు చాలాఉ అనే భావనలో నిర్మాతలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: