ఇప్పుడు లాక్ డౌన్ ని పొడిగించే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించాలని ఇప్పుడు చాలా వరకు ప్రజల్లో కూడా భారీగా డిమాండ్ వినపడుతుంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా తో మాట్లాడుతూ జూన్ 3 వరకు లాక్ డౌన్ ని అమలు చెయ్యాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్యలు చేసారు. దీనితో ఇప్పుడు లాక్ డౌన్ ని తెలంగాణాలో పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఒకవేళ దేశంలో లాక్ డౌన్ ఎత్తి వేసినా సరే తెలంగాణాలో మాత్రం లాక్ డౌన్ ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు సినిమా పరిశ్రమ భయపడుతుంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా సినిమా ఎక్కువగా నష్టపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. లాక్ డౌన్ లేకపోతే మాత్రం ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది వాస్తవం. దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది అనే విషయం అర్ధమవుతుంది. 

 

ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగిస్తే మాత్రం ఈ ఏడాది ఏ సినిమా కూడా షూటింగ్ కి వెళ్ళే అవకాశం దాదాపుగా ఉండదు అనేది అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు నిర్మాతల్లో భయం మొదలయింది. ఇప్పటికే ఎక్కువగా నష్టపోయారు. వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు లాక్ డౌన్ ని కొనసాగించినా సరే తమ షూటింగ్ కి మాత్రం అనుమతి ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. ఎక్కువగా జనాలు లేకుండా షూటింగ్ లను పూర్తి చేసుకుంటామని ఆయన చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: