టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు రాజమౌళి. ఆయనతో సినిమా చేయడానికి ఎందరో హీరోలు, నిర్మాతలు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనతో ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే హీరోలు ఎందరో ఉన్నారు. ఆయనతో సినిమా కోసం తమను తాము మార్చుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అయితే ఆయన సినిమాలకు అందరు హీరోలు సరిపోయే అవకాశం ఉండదు అనేది అందరికి తెలిసిన విషయమే. 

 

అయితే ఇప్పుడు ఆయన కు టాలీవుడ్ లో చాలా వరకు డిమాండ్ ఉంది అనే విషయం అర్ధమవుతుంది. ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేసారు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమాకు సినిమా వసూళ్ళలో 25 శాతం షేర్ తీసుకుంటారని సమాచారం. దీనితో ఆయనకు 100 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

దానయ్య ఆ మేరకే ఆయనతో సినిమా చేయడానికి అంగీకరించారు అంటున్నారు. సినిమా వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాజమౌళి కూడా సినిమా వసూళ్లను ఎక్కువగా టార్గెట్ చేసి పెంచాలి అనే భావనలో ఉన్నారు. అందుకే ఈ సినిమాను సమయం తీసుకుని చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నారని ప్రతీ ఒక్క చిన్న విషయం కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడం దాదాపుగా ఖాయం, ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: