శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తుంటే హీరోయిన్ గా సాయిపల్లవి కనిపిస్తుంది. సాయిపల్లవితో ఫిదా సినిమా తీసిన కమ్ముల మంచి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అయితే సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్లదే డామినేషన్ ఉంటుంది. హీరోయిన్లకే ఎక్కువ వెయిట్ ఇచ్చేలా తన పాత్రలని దిద్దుకుంటాడు కమ్ముల. 

 

 

ఆయన చేసిన ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా వమంటి చిత్రాలని చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. హీరోలే హీరోయిన్ల వెంటపడుతూ కనిపిస్తారు. ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది కాబట్టి శేఖర్ కమ్ముల స్టైల్ ఇది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రూపొందుతున్న లవ్ స్టోరీలోనూ సాయిపల్లవి డామినేషన్ ఉంటుందని  తెలుస్తుంది. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ పై కంప్లీట్ డామినేషన్ సాధించి ఆమె నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోనూ మళ్ళీ అదే రిపీట్ కానుందని సమాచారం.

 

 

ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో చూపించినదాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా హీరోయిన్ డామినేషన్ ఉన్నట్టు అర్థం అవుతుంది.  తెలంగాణ ప్రాంత కుర్రాడిగా కనిపిస్తున్న నాగచైతన్య ఆ మాండలికాన్ని నేర్చుకుని డైలాగులు చెప్పాడట. డామినేషన్ సాయిపల్లవిదే అయినా ఆమెకి ఏమాత్రం తీసిపోకుండా చైతన్య పర్ ఫార్మ్ చేశాడని టాక్.  నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ లవ్ స్టోరీలో చూడబోతున్నామని టాక్. మరి సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు శేఖర్ కమ్ముల ఎవరికి ఎక్కువ వెయిట్ ఇచ్చాడో..

మరింత సమాచారం తెలుసుకోండి: