కరోనా పరిస్థితులలో కనీస అవసరాలకు కూడ దూరమై సతమతమైపోతున్న సినిమా పరిశ్రమలోని 24 క్రాప్స్ విభాలకు చెందిన వారికి సహాయం చేసే విషయమై ఏర్పాటు చేసిన ‘సిసిసి’ కు కోట్లల్లో విరాళాలు వస్తున్నా ఆ విరాళాలు అన్నీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరోలు దర్శకులు నిర్మాతలు మాత్రమే ఇస్తున్నారు. అయితే హీరోలతో సమానంగా కాకపోయినా నటించే ప్రతి సినిమాకు కోట్ల రూపాయలలో భారీ పారితోషికం తీసుకునే క్రేజీ హీరోయిన్స్ మాత్రం సిసిసి కి విరాళాలు అందించకపోవడంతో ఇండస్ట్రీలోని చాలామంది టాప్ హీరోయిన్స్ తీరు పై రగిలిపోతున్నారు.


ఇలాంటి పరిస్థితులలో రకుల్ కుటుంబం ముంబాయిలో నిత్యాన్నదానం వార్తలు మీడియాలో చాల ప్రముఖంగా వస్తున్నాయి. ప్రస్తుతం ముంబాయిలో తన తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న తన తండ్రి రాజేంద్ర సింగ్ సహాయంతో తన ఇంటిని ఒక కిచెన్ గా మార్చి ప్రతిరోజు కొన్ని వేల ఫుడ్ ప్యాకెట్లు తయారు చేయించి ముంబాయ్ లోని ఒక మురికివాడ ప్రాంతాన్ని గుర్తించి ఈ కరోనా సమస్య తీరే వరకు వారికి ఫుడ్ ప్యాకేట్స్ తో పాటు శానిటైజర్లు టవల్స్ సబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు ఆమె తెలియచేసింది. 


అయితే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న రకుల్ ఇప్పటి వరకు సిసిసి కి ఒక్క రూపాయి కూడ విరాళంగా ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రితం నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ హీరోయిన్స్ కు సామాజిక బాధ్యత లేదా టాలీవుడ్ సినీ కార్మికుల బాధలు వారు పట్టించుకోరా అంటూ చాల గట్టిగా ప్రశ్నించాడు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు టాప్ హీరోయిన్స్ తీరు పై మండిపడిపోతున్నారు. 


టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒక్క లావణ్య త్రిపాఠి మినహా మరెవ్వరు సిసిసి కి విరాళం ప్రకటించకపోవడంతో చిరంజీవికి కూడ అసహనం కలిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి టాప్ హీరోయిన్స్ అందరికీ ఫైన్స్ చేస్తూ ఇలాంటి విపత్తు విషయంలో స్పందించవలసిన నైతిక బాధ్యత లేదా అంటూ చిరంజీవి టాప్ హీరోయిన్స్ అందరికీ క్లాస్ పీకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: