ఏ సినిమాకైన ప్రమోషన్ చాలా ముఖ్యం. సినిమా ఎంత బాగున్నా దాన్ని జనాల్లోకి సరిగ్గా తీసుకెళ్ళకపోతే సినిమా తీసినా లాభం ఉండదు. అందుకే ప్రమోషన్ కోసం హీరోలు చాలా కష్టపడుతుంటారు. కొన్ని సార్లు ఎలాంటి కష్టం లేకపోయినా సినిమా మీద ఉన్న ఆసక్తే ప్రేక్షకుడిని థియేటర్లకి రప్పించేలా చేస్తుంది. అయితే అలాంటి ఆసక్తి ఎక్కువగా సినిమా పాటల వల్ల కలుగుతుంది.

 

ఈ మధ్య చూస్తుంటే సినిమాల్లోని పాటలు సక్సెస్ అయ్యాయంటే థియేటర్లో సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ లో ఎక్కువభాగం మ్యూజిక్ కే వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలు బాగుంటే సినిమా మీద ఆసక్తి కలిగి జనాలు థియేటర్లకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యాంకర్ ప్రదీప్ దురదృష్టం పాట సూపర్ హిట్ అయినా కూడా అతనికి నష్టమే వచ్చే అవకాశం కనిపిస్తుంది.

 

యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుండి నీలి నీలి ఆకాశం అన్న పాట రిలీజై యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పాటే ప్రదీప్ సినిమాని ఎక్కడలేని అటెన్షన్ ని తెచ్చి పెట్టింది. యూట్యూబ్ లో 100 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించిన ఈ పాట తెచ్చిన పాపుకారిటీ అంతా వృధా కానుంది. కోవిడ్ 19 వల్ల సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అంతా సర్దుకుని సినిమా థియేటర్లలోకి రావాలంటే సుమారు రెండు నెలలు పడుతుంది.

 

అప్పటి వరకు ఆ పాట స్థానంలో మరో పాట దూసుకెళ్ళే ఛాన్స్ ఉంది. దాంతో జనాలు మెల్లిగా పాటని మర్చిపోతారు. అందువల్ల పాటెంత బాగున్నా.. ఎంత పాపులారిటీ తెచ్చిపెట్టినా కోవిడ్ 19 వల్ల అదంతా వృధా అయిపోయినట్టే

మరింత సమాచారం తెలుసుకోండి: