తెలుగు చిత్ర పరిశ్రమ మునుపెన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా నిర్మాతలు చితికిపోతున్నారు. బ్యాంకులో నుండి తెచ్చిన డబ్బంతా సినిమాపై పెట్టడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి. సినిమా సగం పూర్తయిన నిర్మాతల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. ఆశలన్నీ సినిమాపైనే పెట్టుకుని ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడి పెట్టిన వారికి కరోనా వైరస్ రూపంలో దురదృష్టం వచ్చి కూర్చుంది.

 

 

ఇప్పుడు థియేటర్లు ఎప్పుడు తెరవబడతాయో తెలియదు. థియేటర్లు తెర్చినా జనాలు సినిమాలకి వస్తారా లేరా అనేది కూడా సందేహమే. ఇంకా షూటింగ్ చేసుకోవాల్సిన చిత్రాలకి ఆర్టిస్టుల డేట్లు సర్దుబాటు కావు. డేట్ల విషయంలో క్లాషెస్ నిర్మాతలని ఇబ్బంది పెడుతుంటాయి. తొందరగా సినిమా తీసేద్దామని ఎంత అనుకున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పనులేమీ లేక ఉత్పాదకత పూర్తిగా తగ్గిపోయిన తరుణంలో జనాల దగ్గర డబ్బులు లేవు. 

  

 

 

కాబట్టి పెట్టిన పెట్టుబడి రిటర్న్ అవ్వడం చాలా కష్టం. మరి ఇలాంటి కష్టకాల సమయంలో హీరోలు, హీరోయిన్లు ముందుకు వస్తేనే ఇండస్ట్రీ నిలబడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఆల్రెడీ సగం పూర్తయిన సినిమాలు, స్టార్ట్ అయిన సినిమాలు, స్టార్ట్ అవబోయే సినిమాలకి హీరోల దగ్గర నుండి డైరక్తర్ వరకు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకుంటేనే గానీ సినిమాలని తెరకెక్కించలేరు. రోజు వారి సినీ కార్మికుల కష్టాలు తీర్చడానికి ఎలా ముందుకు వచ్చారో సినీ ఇండస్ట్రీ నిలబడడానికి కొన్ని రోజుల పాటు తమ రెమ్యునరేషన్ ని తగ్గించుకోవాలని నిర్మాతలు ఆకాంక్షిస్తున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: