‘రంగస్థలం’ మ్యాజిక్ రిపీట్ చేయాలని బన్నీ సుకుమార్మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఫస్ట్ లుక్ రేపు బన్ని పుట్టినరోజు సందర్భంగా విడుదల కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. కరోనా వ్యవహారం లేకుండా ఉండి ఉంటే ఈపాటికి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడ పూర్తి కావలసి ఉన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సమస్యలు ఎదురు కావడంతో ఇప్పుడు రేపు కేవలం ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ప్రకటనత పోపాటు ఇప్పటికే ఈ సినిమాలోని బన్ని లుక్ కు సంబంధించిన తీసిన ఫొటో షూట్ నుంచి ఫస్ట్ లుక్ రాబోతోంది.


ఈ సినిమాకు మొదట్లో ‘రంగస్థలం’ సెంటిమెంట్ తో చివరిగా సున్నా వచ్చే విధంగా ‘శేషాచలం’ అన్న టైటిల్ పెడతారని ప్రచారం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీకి ‘పుష్ప’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు అని వార్తలు రావడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా కధలో హీరోయిన్ పాత్ర పేరు పుష్ప అయిన నేపధ్యంలో ఇలాంటి టైటిల్ ఫిక్స్ చేసుకోవడం వెనుక సుకుమార్ కు ఉన్న రెండు అక్షరాల సెంటిమెంట్ కీలకంగా పనిచేసిది అని వార్తలు వస్తున్నాయి. 


గతంలో బన్ని సుకుమ్మార్ ల మూవీ ‘ఆర్య’ సంచలన విజయం సాధించడంతో ఇప్పడు అదే సెంటిమెంట్ ను తిరిగి ప్రయోగిస్తున్నట్లు టాక్. అయితే ఈ మూవీకి ‘పుష్ప’ అనే టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు అని వార్తలు రావడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్తఆశ్చర్యానికి గురి అవుతున్నారు.  ఒక టాప్ హీరో సినిమాకు హీరోయిన్ పేరు టైటిల్ ఏమిటి అంటూ బన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 


దీనితో టైటిల్ తోనే సుకుమార్ బన్ని సినిమా విషయంలో మళ్లీ మరో ‘రంగస్థలం’ లెవెల్ సినిమా చూపించబోతున్నాడా అన్న మాటలు ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇంకా అధికారకంగా కామెంట్స్ వస్తున్నాయి. కరోనా దెబ్బతో సినిమాలు లేని హడావిడి రేపు బన్నీ ఫస్ట్ లుక్ తో కొంత వరకు తీరే ఆస్కారం కనిపిస్తోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: