రామ్ గోపాల్ వర్మ.. ఆయనకు పిచ్చి పట్టిందని మరికొందరు.. ఇంకొందరు ఆయన లాజిక్ లేనిదే ఏదీ మాట్లాడాడు అని ఆర్జీవీకి మద్దతుగా మాట్లాడతారు. ఈ ప్రపంచంలో అందరూ ఎడ్డెం ఆర్జీవీ ఒక్కడు కాదు తెడ్డెం అంటాడు. అనడమే కాదు అందుకు ఆధారాలు కూడా చూపిస్తాడు. అందరినీ నమ్మిస్తాడు. అంతేకాదు తన సినిమాలను ఎప్పుడు ఎలా తీస్తాడో తనకే తెలీదు. అయితే ప్రతిదీ వివాదస్పదంగా ఉండే అంశాన్నే ఎంపిక చేసుకుంటాడు. అన్నింట్లోనూ తనకు అనుకూలంగా మలచుకుంటాడు. రాజకీయాలు, దెయ్యాలు, బాంబు బ్లాస్టులు, బయోగ్రఫీలు, రౌడీయిజం ఇలా ఏ అంశంపై అయినా అవలీలగా సినిమా తీసేస్తుంటాడు. ఆ సినిమాలు హిట్లా.. ఫ్లాపులా అనే విసయాలన అస్సలు పట్టించుకోడు. ఆర్జీవీ కేవలం డైరెక్టర్ గా ఆగిపోలేదు. స్క్రీన్ ప్లే, నిర్మాతతో పాటు ఇంకా ఎన్నో రకాల పాత్రలను తెరవెనుక నుండి పోషించారు. ఏప్రిల్ 7వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా కరోనా వైరస్ కు ధన్యవాదాలు చెబుతూ ఒంటరిగా పాట కూడా పాడేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

 

తెలుగు సినిమా రంగంలో అప్పటివరకు ఒకే రకమైన సినిమాలతో బోరు కొట్టిన జనానికి, రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో తీసిన ‘శివ‘ అప్పట్లో సెన్సెషనల్ హిట్ అయ్యింది. అక్కడి నుండి వర్మ అసలు వెనుకడుగు అనేదే వేయలేదు. అలా శివ సినిమాతో బోణీ కొట్టిన వర్మ ఏకంగా బాలీవుడ్ కు సైతం అడుగు పెట్టాడు. ఎందరో శిష్యులను... రామ్ గోపాల్ వర్మ టెక్నికల్ గా మంచి ప్రావీణ్యం కలవాడు. అంతేకాదు తన దగ్గర పని చేసిన ఎందరో శిష్యులు ప్రస్తుతం టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. అలా వచ్చిన వారిలో పూరి జగన్నాథ్, తేజ ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో మనం నిజాన్ని అబద్ధం అనే వాళ్లను ఎంతోమందిని చూసుంటాం. కొన్ని అబద్ధాలను నిజం అనే వాళ్లనూ చూసుంటాం. అయితే ఆర్జీవీ మాత్రం ఏది నిజమో... ఏది అబద్ధమో తన కోణంలో మాత్రమే చూపిస్తాడు. చూస్తే చూడండి.. లేదంటే మానేయ్యండి. నాకు నిజం అనిపించింది నేను తీశా అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. 

 

ఆర్జీవీ వివాదస్పద సినిమాలు మాత్రమే తీస్తాడనుకుంటే మీరు పొరబడినట్లే. ఆయన రొమాన్స్, ప్రేమ, ఎమోషన్, యాక్షన్, మాఫీయా, నిజ జీవిత సంఘటనలు ఏవి తీసుకున్నా ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం కచ్చితంగా ఉంటుంది. నాటి శివ, గోవింద గోవింద, రంగీలా, సత్య నుండి నేటి ఐస్ క్రీమ్, లక్ష్మీస్ ఎన్టీఆర్ వరకు ప్రతి దానిలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అంతేకాదు గాడ్ సెక్స్ ట్రూత్ (జిఎస్టీ)తో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్త ఫాలోయింగ్.. ఆర్జీవీకి ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ స్లమ్ డాగ్ మిలినీయర్స్ డైరెక్టర్ డేనీ బోయల్ లాంటి డైరెక్టరే తనపై వర్మ ప్రభావం ఉందని చెప్పాడంటే ఆయన క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఏ డైరెక్టర్ అయినా ఏదైనా సినిమా తీయాలంటే సొంతంగా కథను రాసుకుంటారు. లేదా రచయితల నుండి తెప్పించుకుంటారు. కానీ వర్మ మాత్రం కథపై పరిశోధన చేస్తారు. అందుకు సంబంధించిన అంశాలతోనే కథను రెడీ చేస్తారు. అందులో ప్రతిదీ జనం మధ్యలో నుండి వచ్చిన అంశాలే కావడంతో వర్మ సినిమాల వద్దన్నా ఎవరైనా చూస్తూనే ఉంటారు. అవార్డులు.. రామ్ గోపాల్ వర్మకు తను తీసిన సినిమాలకు గానూ ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా శివకు, క్షణ క్షణం, ప్రేమ కథా చిత్రానికి ఇలా మూడుసార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు. రంగీలా, సత్య చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా వర్మను అవార్డు వరించింది. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆర్జీవీ అభిమానులు కోరుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: